Toyota Camry : హైబ్రిడ్ మ్యాజిక్.. భారీ డిస్కౌంట్.. టయోటా కామ్రీ కొనేందుకు ఇదే సరైన సమయం

టయోటా కామ్రీ కొనేందుకు ఇదే సరైన సమయం

Update: 2026-02-17 07:49 GMT

 Toyota Camry : లగ్జరీ కార్ల ప్రపంచంలో సెడాన్ల క్రేజ్ వేరు. అందులోనూ హ్యుందాయ్, మారుతి వంటి బ్రాండ్ల కంటే ఒక మెట్టు పైన ఉండే టోయోటా బ్రాండ్ నుంచి వచ్చే కామ్రీకి ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మీరు గనుక ఒక ప్రీమియం సెడాన్ కొనాలని ప్లాన్ చేస్తుంటే, ఫిబ్రవరి 2026 మీకు ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది. టయోటా కామ్రీపై ఈ నెలలో ఏకంగా రూ.1.24 లక్షల వరకు భారీ తగ్గింపును పొందే వెసులుబాటు ఉంది. హ్యుబ్రిడ్ టెక్నాలజీతో పాటు విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునే వారికి ఇది కచ్చితంగా బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

ఈ భారీ డిస్కౌంట్ కేవలం ఒక్క రూపంలోనే రాదు. దీనిని కంపెనీ వివిధ రకాలుగా విభజించింది. ఇందులో పాత కారును మార్చుకునే వారికి ఇచ్చే ఎక్స్ఛేంజ్ బోనస్, ఇప్పటికే టయోటా కారు వాడుతున్న వారికి ఇచ్చే లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఉద్యోగుల కోసం ప్రత్యేక స్కీములు ఉన్నాయి. వీటితో పాటు కారుకు అదనపు రక్షణనిచ్చే ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీని కూడా ఈ ఆఫర్‌లో భాగంగా పొందవచ్చు. అంటే కారు కొన్నప్పుడు మాత్రమే కాదు, భవిష్యత్తులో మెయింటెనెన్స్ ఖర్చులను కూడా ఈ ఆఫర్ తగ్గిస్తుంది.

టయోటా కామ్రీ అంటేనే పర్యావరణ హితమైన హ్యుబ్రిడ్ టెక్నాలజీకి పెట్టింది పేరు. ఇది పెట్రోల్ ఆదా చేయడమే కాకుండా, ఇంజిన్ శబ్దం లేకుండా నిశ్శబ్దంగా, స్మూత్‌గా ప్రయాణించేలా చేస్తుంది. కారు లోపలి భాగం (కేబిన్) ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఫీలింగ్‌ను ఇస్తుంది. వెనుక సీట్లలో కూర్చునే వారికి లభించే లెగ్ రూమ్, ప్రీమియం లెదర్ అప్హోల్స్టరీ, అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఈ కారును ఒక లగ్జరీ ప్యాలెస్‌లా మారుస్తాయి. సిటీలో తిరిగినా, లాంగ్ డ్రైవ్‌కు వెళ్లినా అలిసిపోకుండా ప్రయాణించవచ్చు.

అయితే ఇక్కడ ఒక చిన్న మెలిక ఉంది. ఈ రూ.1.24 లక్షల ఆఫర్ అన్ని కార్లపై ఉండదు. కేవలం ఎంపిక చేసిన స్టాక్ పై మాత్రమే ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. అంటే షోరూమ్‌లో ఉన్న పరిమిత సంఖ్యలో కార్లకు మాత్రమే ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కాబట్టి ఆఫర్ ముగియక ముందే లేదా స్టాక్ అయిపోక ముందే మీ సమీప టయోటా డీలర్‌ను సంప్రదించి వివరాలు తెలుసుకోవడం మంచిది. లగ్జరీతో పాటు మైలేజీ కూడా కావాలనుకునే వారికి కామ్రీ హ్యుబ్రిడ్ ఈ ఫిబ్రవరిలో ఒక లాభదాయకమైన ఎంపిక.

Tags:    

Similar News