Toyota Taisor : కొత్త కారు కొనే ప్లాన్ ఉందా? టయోటా టైజర్ పై భారీ డిస్కౌంట్..ఏకంగా ఎంత తగ్గిందంటే ?

ఏకంగా ఎంత తగ్గిందంటే ?

Update: 2026-02-17 08:03 GMT

Toyota Taisor : ఫిబ్రవరి నెల వచ్చేసింది.. కార్ల మార్కెట్లో ఆఫర్ల సందడి మొదలైంది. మీరు ఒక స్టైలిష్, కాంపాక్ట్, సిటీ డ్రైవింగ్‌కు వీలుగా ఉండే కారు కోసం చూస్తుంటే, టయోటా టైజర్ పై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మారుతి ఫ్రాంక్స్, టాటా పంచ్ వంటి కార్లకు గట్టి పోటీ ఇస్తున్న ఈ క్రోస్ ఓవర్ ఎస్‌యూవీపై ఈ నెలలో భారీ డిస్కౌంట్లు ప్రకటించింది కంపెనీ. టయోటా బ్రాండ్ వాల్యూతో పాటు ఈ ఆఫర్లు తోడవ్వడంతో కొత్త కారు కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశం.

ఫిబ్రవరి 2026లో టయోటా టైజర్ కొనుగోలుపై గరిష్టంగా రూ.55,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, లాయల్టీ బెనిఫిట్స్ ఉన్నాయి. వేరియంట్లను బట్టి ఆఫర్లు మారుతుంటాయి. మీరు పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే టర్బో ఇంజిన్ వేరియంట్ ఎంచుకుంటే, నేరుగా రూ.25,000 వరకు నగదు తగ్గింపు పొందవచ్చు. నాన్ టర్బో వేరియంట్ల పై సుమారు రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్, మిగిలిన మొత్తాన్ని ఎక్స్ఛేంజ్ రూపంలో పొందవచ్చు. పాత టయోటా కారు ఉన్నవారికి ప్రత్యేకంగా లాయల్టీ బోనస్, కార్పొరేట్ ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు కూడా ఉన్నాయి.

టేజర్ కారులో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ ఉంది. ఇది కేవలం వేగం కోసమే కాదు, సిటీలో ట్రాఫిక్ మధ్య దూసుకుపోవడానికి చాలా బాగుంటుంది. దీనివల్ల డ్రైవింగ్ అనుభవం చాలా స్పోర్టీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీనిపై ఉన్న రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ ఈ వేరియంట్‌ను మరింత వాల్యూ-ఫర్-మనీగా మార్చేసింది. యువతను, వేగాన్ని ఇష్టపడే రైడర్లను ఈ వేరియంట్ బాగా ఆకట్టుకుంటోంది.

సిటీ రోడ్లపై నడపడానికి టేజర్ చాలా అనువైన కారు. ఎస్‌యూవీ లాంటి లుక్ ఉన్నా.. కాంపాక్ట్ సైజులో ఉండటం వల్ల పార్కింగ్ చేయడం చాలా ఈజీ. ఇందులో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు టయోటా ఇచ్చే 3 ఏళ్లు లేదా 1,00,000 కి.మీ వారంటీ వినియోగదారులకు మరింత భరోసాను ఇస్తుంది.

Tags:    

Similar News