Vespa Officina 8 : స్టైల్ అంటే ఇదే..ఇండియాలో వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్

ఇండియాలో వెస్పా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్

Update: 2026-02-13 08:51 GMT

Vespa Officina 8 : ఇటాలియన్ ఐకానిక్ బ్రాండ్ వెస్పా ఇండియాలో తన చరిత్రను గుర్తుచేస్తూ ఒక అద్భుతమైన స్పెషల్ ఎడిషన్ స్కూటర్‌ను లాంచ్ చేసింది. అదే వెస్పా ఆఫీసినా 8. సుమారు 80 ఏళ్ల క్రితం వెస్పా పుట్టిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, వింటేజ్ లుక్, మోడరన్ ఫీచర్ల కలయికతో ఈ స్కూటర్‌ను రూపొందించారు. కేవలం స్టైల్ కోసమే కాదు, వెస్పా వారసత్వాన్ని ప్రేమించే వారి కోసం ఇది ఒక కలెక్టర్స్ ఎడిషన్ అని చెప్పవచ్చు.

ఆఫీసినా 8 అనే పేరుకు ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. 1944లో ఇటలీలోని పొంటెడెరాలో ఉన్న పియాజియో ప్లాంట్‌లో ఒక ప్రయోగాత్మక వర్క్‌షాప్ ఉండేది. అక్కడే ఇంజనీర్లు వెస్పా మొదటి ప్రోటోటైప్‌ను సిద్ధం చేశారు. 1946లో వెస్పాకు అఫీషియల్‌గా పేటెంట్ వచ్చింది. ఆ చారిత్రక సందర్భాన్ని సెలబ్రేట్ చేస్తూ ఇప్పుడు రూ.1.34 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్ అయ్యింది.

వెస్పా ఆఫీసినా 8 కారును చూడగానే దాని మ్యాట్ మెటాలిక్ బ్లూ కలర్ మనల్ని ఆకట్టుకుంటుంది. ఇందులో మెటాలిక్ రివెట్‌లు, బ్రాస్, అల్యూమినియం టోన్ ఫినిషింగ్ ఇచ్చారు. సీటును రిబ్బెడ్ డిజైన్‌తో రూపొందించి, దానికి బాడీ కలర్‌ను మ్యాచ్ చేశారు. వెస్పా సిగ్నేచర్ రౌండ్ హెడ్ ల్యాంప్, క్లాసిక్ బాడీ లైన్స్ ఈ స్కూటర్‌కు ఒక యూనిక్ ఇండస్ట్రియల్ లుక్‎ను ఇస్తున్నాయి.

ఈ స్పెషల్ ఎడిషన్ స్కూటర్ 125cc, 150cc.. రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మీ అవసరానికి తగ్గట్టుగా మీరు వేరియంట్‌ను ఎంచుకోవచ్చు. స్మూత్ రైడింగ్ కోసం ఇందులోని సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేశారు. వెస్పా ఇండియా తన సెలెక్టెడ్ డీలర్‌షిప్‌ల ద్వారా ఈ మోడల్‌ను విక్రయించనుంది.

కేవలం స్కూటర్ మాత్రమే కాదు, వెస్పా ఆఫీసినా 8 కొనుగోలు చేసే వారికి కంపెనీ ఒక ఎక్స్‌క్లూజివ్ వెల్కమ్ కిట్ అందిస్తోంది. ఇందులో స్కూటర్ రంగుకు సరిపోయే హాఫ్-ఫేస్ హెల్మెట్, ఆఫీసినా 8 చరిత్రను వివరించే ఒక స్పెషల్ బుక్, ఆఫీసినా 8 బ్రాండెడ్ దుస్తులు ఉంటాయి. అదనపు ఖర్చుతో స్కూటర్ కలర్ లో ఉండే టాప్ బాక్స్ కూడా మీరు అమర్చుకోవచ్చు.

Tags:    

Similar News