Volvo EX60 : వోల్వో ఎలక్ట్రిక్ సునామీ.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 810 కిలోమీటర్ల ప్రయాణం

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 810 కిలోమీటర్ల ప్రయాణం

Update: 2026-01-10 12:57 GMT

Volvo EX60 : ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ వోల్వో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు ఉన్న ఎలక్ట్రిక్ కార్ల రికార్డులను తిరగరాస్తూ, వోల్వో తన అమ్ములపొదిలో నుంచి EX60 అనే మిడ్-సైజ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఈ ఏడాది జనవరి 21న దీని గ్లోబల్ ప్రీమియర్ జరగనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాపులర్ మోడల్ XC60 స్థానంలో ఈ కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ రాబోతోంది. కేవలం లుక్ పరంగానే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా ఇది ఒక సంచలనమని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు.

సాధారణంగా ఎలక్ట్రిక్ కార్లు అంటే రేంజ్ విషయంలో అందరికీ ఒక రకమైన ఆందోళన ఉంటుంది. కానీ వోల్వో EX60 ఆ భయాలకు చెక్ పెట్టబోతోంది. ఈ ఎస్‌యూవీ ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 810 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. అంటే మీరు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ఒక్క ఛార్జింగ్‌తో సునాయాసంగా వెళ్ళిపోవచ్చు. అమెరికన్ మార్కెట్ ప్రమాణాల ప్రకారం కూడా ఇది 644 కిలోమీటర్ల భారీ రేంజ్‌ను ఆఫర్ చేస్తోంది.

ఛార్జింగ్ టైమ్ విషయంలో వోల్వో ఒక అద్భుతం చేసిందని చెప్పాలి. ఇందులో సరికొత్త 800-వోల్ట్ ఎలక్ట్రికల్ సిస్టమ్ వాడారు. దీనివల్ల 400kW DC ఫాస్ట్ ఛార్జర్‌కు కనెక్ట్ చేస్తే, కేవలం 10 నిమిషాల్లోనే 340 కిలోమీటర్ల ప్రయాణానికి సరిపడా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. అంటే మీరు ఒక టీ తాగి వచ్చే లోపు మీ కారు సగం దూరం ప్రయాణించడానికి సిద్ధమైపోతుంది. ఇంతటి హై-పర్ఫార్మెన్స్ బ్యాటరీ ప్యాక్‌పై వోల్వో ఏకంగా 10 ఏళ్ల వారంటీని ఇస్తుండటం విశేషం.

వోల్వో అంటేనే భద్రతకు మారుపేరు. EX60 కోసం వోల్వో స్కేలబుల్ ప్రొడక్ట్ ఆర్కిటెక్చర్ 3 అనే కొత్త ప్లాట్‌ఫారమ్‌ను పరిచయం చేస్తోంది. ఇందులో సెల్-టు-బాడీ టెక్నాలజీని వాడారు. అంటే బ్యాటరీ ప్యాక్ నేరుగా కారు ఛాసిస్‌లోనే ఒక భాగంగా ఉంటుంది. దీనివల్ల కారు స్ట్రక్చర్ చాలా బలంగా ఉంటుంది. యాక్సిడెంట్ సమయంలో ప్రయాణికులకు గరిష్ట రక్షణ లభిస్తుంది. అలాగే కారు హ్యాండ్లింగ్ కూడా చాలా స్మూత్‌గా ఉంటుంది.

ఈ కారు తయారీలో వోల్వో మొదటిసారిగా మెగా కాస్టింగ్ అనే టెక్నాలజీని ఉపయోగిస్తోంది. వందల కొద్దీ చిన్న చిన్న భాగాలను వెల్డింగ్ చేసే బదులు, పెద్ద అల్యూమినియం భాగాలను ఒకేసారి డై-కాస్టింగ్ మెషీన్ల ద్వారా తయారు చేస్తారు. దీనివల్ల కారు బరువు గణనీయంగా తగ్గుతుంది మరియు అసెంబ్లీ ప్రాసెస్ సులభతరం అవుతుంది. బరువు తగ్గడం వల్ల కారు వేగం, రేంజ్ మరింత పెరుగుతాయి.

Tags:    

Similar News