Airtel : ఎయిర్ టెల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఓటీటీ బెనిఫిట్స్‌తో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!
ఓటీటీ బెనిఫిట్స్‌తో టాప్ 5 ప్రీపెయిడ్ ప్లాన్స్ ఇవే!;
Airtel : ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్నారా? అయితే, మీకో గుడ్ న్యూస్. ఎయిర్‌టెల్ తమ కస్టమర్ల కోసం ఐదు అదిరిపోయే ఓటీటీ ప్లాన్స్‌ను తీసుకొచ్చింది. వీటి ధరలు రూ.979 నుండి రూ.1798 వరకు ఉన్నాయి. ఈ ప్లాన్‌లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం వంటి ఓటీటీ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్‌లు ఉచితంగా వస్తాయి. మరి ఏ ప్లాన్‌లో ఎంత డేటా, ఏ ఓటీటీ ప్రయోజనాలు ఉన్నాయో చూద్దాం.
ఎయిర్‌టెల్ ఓటీటీ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు:
ఎయిర్‌టెల్ రూ.979 ప్లాన్:
ఈ ప్లాన్‌తో మీకు రోజుకు 2 GB డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ వస్తాయి. దీని వాలిడిటీ 84 రోజులు. ఈ ప్లాన్‌లో ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం (22+ OTT యాప్‌లు), ఫ్రీ హెలోట్యూన్, పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సబ్‌స్క్రిప్షన్ లభిస్తాయి.
ఎయిర్‌టెల్ రూ.1029 ప్లాన్:
ఈ ప్లాన్ కూడా 84 రోజుల వాలిడిటీతో వస్తుంది. ఇందులో రోజుకు 2 GB డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే, ఇందులో మీకు మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, పెర్‌ప్లెక్సిటీ ప్రో AI సబ్‌స్క్రిప్షన్ వస్తుంది.
ఎయిర్‌టెల్ రూ.1199 ప్లాన్:
రూ.1199 ప్లాన్‌తో రోజుకు 2.5 GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. 84 రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో అమెజాన్ ప్రైమ్ లైట్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం, పెర్‌ప్లెక్సిటీ ప్రో సబ్‌స్క్రిప్షన్స్ ఉంటాయి.
ఎయిర్‌టెల్ రూ.1729 ప్లాన్:
రూ.1729 ప్లాన్ కొంటే మీకు నెట్‌ఫ్లిక్స్ బేసిక్, జీ5 ప్రీమియం, పెర్‌ప్లెక్సిటీ ప్రో AI, జియో హాట్‌స్టార్ సూపర్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం వంటి ఓటీటీ యాప్‌ల బెనిఫిట్స్ వస్తాయి. వీటితో పాటు రోజుకు 2 GB డేటా, రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్ కూడా లభిస్తాయి.
ఎయిర్‌టెల్ రూ.1798 ప్లాన్:
రూ.1798 ప్లాన్ అనేది నెట్‌ఫ్లిక్స్ బేసిక్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ ప్లే ప్రీమియం, అన్‌లిమిటెడ్ 5G డేటా, పెర్‌ప్లెక్సిటీ ప్రో వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీతో రోజుకు 100 SMS, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 3 GB డేటాను అందిస్తుంది.
రిలయన్స్ జియోలో ఎన్ని ఓటీటీ ప్లాన్స్ ఉన్నాయి?
రిలయన్స్ జియో కూడా అన్ని రకాల ఓటీటీ ప్లాన్‌లను అందిస్తోంది. జియోలో మొత్తం 11 ఓటీటీ బెనిఫిట్స్ ఉన్న రీఛార్జ్ ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్‌ల ధరలు రూ.100 నుండి రూ.3999 వరకు ఉంటాయి. వీటి వాలిడిటీ 28 రోజుల నుండి 365 రోజుల వరకు ఉంటుంది.