LIC : సాలరీ తీసుకునే వారికి బెస్ట్ ఎల్ఐసీ ప్లాన్‌లు ఇవే.. సేఫ్టీకి సేఫ్టీ, డబ్బులు ఆదా

సేఫ్టీకి సేఫ్టీ, డబ్బులు ఆదా;

Update: 2025-07-10 05:34 GMT

LIC : భారతీయ జీవిత బీమా సంస్థ దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా కంపెనీ. ఇది అనేక రకాల ఇన్సూరెన్స్ ప్లాన్‌లను అందిస్తుంది. ప్రస్తుత కాలంలో ప్రమాదాలు లేదా అనారోగ్యం ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి, మన మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రతను అందించే ఇన్సూరెన్స్ మునుపెన్నడూ లేనంత అవసరం. ఈ నేపథ్యంలో LIC అందించే అనేక ప్లాన్‌లలో, జీతం తీసుకునే వారికి బాగా సరిపోయే కొన్ని ఇన్సూరెన్స్ పాలసీల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎక్కువ రిస్క్ తీసుకుని ఎక్కువ రాబడిని పొందాలనుకునే వారికి టెక్ టర్మ్ ప్లాన్ చాలా అనుకూలం. దీన్ని ఆన్‌లైన్‌లోనే కొనుగోలు చేయవచ్చు. ఆఫ్‌లైన్‌తో పోలిస్తే ఆన్‌లైన్‌లో ప్రీమియం తక్కువగా ఉంటుంది. ఎక్కువ ప్రీమియం చెల్లించి, చివరి మొత్తాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఈ పాలసీలో దురదృష్టవశాత్తు పాలసీదారు మరణిస్తే, నామినీలకు డబ్బు ఎలా అందాలో ఎంచుకోవచ్చు. ఒకేసారి పెద్ద మొత్తాన్ని పొందవచ్చు, లేదా 5, 10 లేదా 15 సంవత్సరాల పాటు వాయిదాలలో డబ్బు అందేలా చేసుకోవచ్చు. ఈ పాలసీలో ఆక్సిడెంట్ రైడర్‌ను అదనంగా తీసుకోవచ్చు. ఇది ప్రమాదం వల్ల మరణిస్తే అదనపు కవరేజ్ అందిస్తుంది.

ఎల్‌ఐసి జీవన్ లాభ్

ఈ పాలసీ మెచ్యూరిటీ అయినప్పుడు పాలసీదారులకు ఒకేసారి పెద్ద మొత్తం అందుతుంది. ఒకవేళ మెచ్యూరిటీ అవ్వకముందే పాలసీదారు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లిస్తారు. ఈ పాలసీ మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఎల్‌ఐసి సంస్థ సంపాదించే లాభాల ఆధారంగా బోనస్ లభిస్తుంది. ప్రీమియం చెల్లింపుపై పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.

ఎల్‌ఐసి జీవన్ ఉమంగ్ యోజన

ఇది 100 సంవత్సరాల వయస్సు వరకు కవరేజ్ అందించే అరుదైన ఇన్సూరెన్స్ ప్లాన్. ప్రీమియం చెల్లింపు కాలం ముగిసిన తర్వాత, ఈ పాలసీ మెచ్యూర్ అయ్యే వరకు పాలసీదారులకు వార్షికంగా డబ్బు లభిస్తూ ఉంటుంది. ఖచ్చితమైన హామీ మొత్తంలో 8శాతం ప్రతి సంవత్సరం అందజేస్తారు. దీనితో పాటు రివర్షనరీ బోనస్ కూడా లభిస్తూ ఉంటుంది.

ఎల్‌ఐసి జీవన్ అమర్ పాలసీ

ఇది కూడా ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ పాలసీ మెచ్యూర్ అయిన తర్వాత పాలసీదారు మరణిస్తే, వారి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం లభిస్తుంది. జీవన్ అమర్ పథకంలో మహిళా జీతం తీసుకునే వారికి 10శాతం నుండి 20శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. హామీ మొత్తం పెరిగే కొద్దీ ప్రీమియంలోనూ డిస్కౌంట్ లభిస్తుంది.

Tags:    

Similar News