BSNL : బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్..రూ.251కే 100GB డేటా..జియో, ఎయిర్‌టెల్ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్!
జియో, ఎయిర్‌టెల్ మైండ్ బ్లాక్ అయ్యే ప్లాన్!
BSNL : ప్రైవేట్ టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్ తమ రీఛార్జ్ ధరలను పెంచి కస్టమర్ల నెత్తిన భారం వేస్తుంటే, ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం అదిరిపోయే ఆఫర్లతో దూసుకుపోతోంది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు ఆశించే యూజర్ల కోసం బీఎస్ఎన్ఎల్ తాజాగా ఒక అద్భుతమైన ప్రిపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. కేవలం రూ.251కే ఏకంగా 100GB డేటాను అందిస్తూ మార్కెట్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్లాన్ ద్వారా లభించే ఇతర ప్రయోజనాలు, జియోతో పోలిస్తే ఇది ఎంత మెరుగ్గా ఉందో ఈ వార్తలో తెలుసుకుందాం.
బీఎస్ఎన్ఎల్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. BSNL కార్నివాల్ ప్లాన్‌లో భాగంగా ప్రవేశపెట్టిన ఈ రూ.251 రీఛార్జ్‌తో యూజర్లకు ఏకంగా 100GB హై-స్పీడ్ డేటా లభిస్తుంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత ఉచిత కాల్స్ మాట్లాడుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ లో ఎస్ఎంఎస్ సదుపాయం గురించి కంపెనీ స్పష్టత ఇవ్వలేదు. ఈ డేటా ఆఫర్ భారీగా ఉండటంతో ఇంటర్నెట్ ఎక్కువగా వాడే వారికి ఇది వరమనే చెప్పాలి.
ఈ ప్లాన్ వాలిడిటీ విషయానికి వస్తే రూ.251తో రీఛార్జ్ చేసుకుంటే 30 రోజుల పాటు సేవలు అందుబాటులో ఉంటాయి. డేటా, కాలింగ్‌తో పాటు ఉచితంగా BiTV ఎంటర్‌టైన్‌మెంట్ యాక్సెస్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ఈ ప్రత్యేక ఆఫర్ డిసెంబర్ 24, 2025 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇది జనవరి 31, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంటే కొత్త ఏడాది సందర్భంగా కస్టమర్లకు బిఎస్ఎన్ఎల్ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇది.
రిలయన్స్ జియోతో పోల్చి చూస్తే బీఎస్ఎన్ఎల్ ప్లాన్ చాలా శక్తివంతంగా కనిపిస్తోంది. ప్రస్తుతం జియో వద్ద రూ. 251 ధరలో ఇలాంటి ప్లాన్ ఏదీ లేదు. జియోలో రూ. 289 ప్లాన్ అందుబాటులో ఉన్నప్పటికీ, అది కేవలం 40 GB డేటాను మాత్రమే 30 రోజుల వాలిడిటీతో అందిస్తుంది. పైగా అందులో కాలింగ్ సౌకర్యం ఉండదు, అది కేవలం డేటా ప్యాక్ మాత్రమే. కానీ బిఎస్ఎన్ఎల్ మాత్రం అంతకంటే తక్కువ ధరకే 100 GB డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌ను కూడా ఇస్తోంది. ప్రైవేట్ నెట్‌వర్క్‌ల బాదుడుతో విసిగిపోయిన కస్టమర్లు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ వైపు క్యూ కడుతున్నారు.