Diwali Bonanza : పోస్టల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. 2 నెలల జీతానికి సమానమైన బోనస్.. ఎవరికి ఎంతంటే

2 నెలల జీతానికి సమానమైన బోనస్.. ఎవరికి ఎంతంటే

Update: 2025-10-18 12:21 GMT

Diwali Bonanza : భారతదేశంలో పండుగల సీజన్ వచ్చిందంటే ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుంది. ఈసారి కేంద్ర ప్రభుత్వం దీపావళికి ముందే కోట్లాది మంది ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా, డీఏ పెంపు, సీజీహెచ్ఎస్ మెరుగుదల వంటి మూడు ముఖ్యమైన ప్రకటనలు చేసింది. ఈ శుభ సందర్భంలో ఇప్పుడు పోస్టాఫీస్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం అదిరిపోయే దీపావళి బహుమతిని ప్రకటించింది. ఆర్థిక సంవత్సరం 2024-25కు గానూ రెండు నెలల జీతానికి సమానమైన బోనస్‌ను ఇవ్వడానికి పోస్టల్ శాఖ ఆమోదం తెలిపింది.

భారత ప్రభుత్వానికి చెందిన పోస్టాఫీస్ ఉద్యోగుల కోసం ఆర్థిక సంవత్సరం 2024-25కు గానూ ఉత్పాదకత ఆధారిత బోనస్ ప్రకటించింది. ఈ ఆమోదం భారత రాష్ట్రపతి అంగీకారం తర్వాత జారీ చేశారు. ఈ పథకం కింద అర్హులైన ఉద్యోగులకు ఏకంగా 60 రోజుల జీతానికి సమానమైన బోనస్ లభించనుంది. ఈ నిర్ణయం ఉద్యోగుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు, పండుగ ఉత్సాహాన్ని రెట్టింపు చేయనుంది.

ఈ భారీ బోనస్ వల్ల లక్షలాది మంది పోస్టల్ ఉద్యోగులు నేరుగా ప్రయోజనం పొందనున్నారు. కింది ఉద్యోగులకు ఈ బోనస్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రూప్-సి ఉద్యోగులు, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, నాన్ గెజిటెడ్ గ్రూప్-బి ఉద్యోగులు, గ్రామీణ డాక్ సేవకులు, పూర్తికాలం పనిచేసే ఆకస్మిక కార్మికులు ఈ ప్రయోజనం లభించనుంది.

బోనస్ మొత్తాన్ని లెక్కించే విధానం గురించి కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఉద్యోగుల సగటు జీతం ఆధారంగా ఈ బోనస్ మొత్తాన్ని లెక్కిస్తారు. సాధారణ ఉద్యోగులకు బోనస్ లెక్కించడానికి ఫార్ములా: (సగటు నెలవారీ జీతం × 60 రోజులు ÷ 30.4). ఈ లెక్కలో బేసిక్ పే, డీఏ, స్పెషల్ అలవెన్స్, డ్యూటీ అలవెన్స్, ట్రైనింగ్ అలవెన్స్ వంటివి కూడా కలుపుతారు. బోనస్ కోసం గరిష్ఠ జీతం పరిమితి నెలకు రూ.7,000 గా నిర్ణయించబడింది. గ్రామీణ డాక్ సేవకులకు బోనస్ మొత్తం వారి టైమ్-రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్, డీఏ ఆధారంగా నిర్ణయిస్తారు. ఈ భారీ మొత్తంలో బోనస్ పండుగ సీజన్‌లో పోస్టల్ ఉద్యోగులకు నిజంగా డబుల్ బొనాంజా అనే చెప్పాలి.

Tags:    

Similar News