MY Bharat : వాట్సాప్ లో ప్రభుత్వం కొత్త సర్వీసు.. కోట్లాది యువతకు ఇక పండుగే

కోట్లాది యువతకు ఇక పండుగే;

Update: 2025-06-28 05:44 GMT

MY Bharat : భారత ప్రభుత్వం యువతతో కనెక్ట్ అయ్యే విధానాన్ని ఇప్పుడు మరింత స్మార్ట్‌గా, సులభంగా మార్చేసింది. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ పోర్టల్‌ను నేరుగా వాట్సాప్ చాట్‌బాట్‌తో అనుసంధానించింది. ఇప్పుడు దేశంలోని ఏ యువకుడైనా కేవలం ఒక 'Hi' మెసేజ్ పంపి, సర్వీస్, లెర్నింగ్, లీడర్ షిప్ కు సంబంధించిన కొత్త మార్గాలను కనుగొనవచ్చు. ప్రభుత్వ పథకాలు, వాలంటరీ అవకాశాలతో యువతను అనుసంధానించే దిశగా ఇది ఒక పెద్ద ముందడుగు. యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మై భారత్ పోర్టల్‌ను వాట్సాప్ చాట్‌బాట్‌తో అనుసంధానించడాన్ని ప్రారంభించింది. కేవలం 7289001515 నంబర్‌కు వాట్సాప్‌లో 'Hi' అని పంపాలి. ఆ వెంటనే మీ ఫోన్ ప్రభుత్వ సేవలకు కనెక్ట్ అవుతుంది.

ఎలాంటి ఉపయోగాలుంటాయి

* వాలంటీరింగ్ అవకాశాలు: సమాజ సేవ ద్వారా దేశంతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం.

* సీవీ (CV) నిర్మాణం: మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవడానికి మంచి రెజ్యూమ్ తయారు చేసుకోవచ్చు.

* మెంటర్స్ తో కనెక్షన్: నిపుణుల నుంచి ఎలాంటి సందేహాలను అయితే తీర్చుకోవచ్చు.

* సంస్థలలో చేరడం లేదా స్థాపించడం: లీడర్ షిప్ క్వాలిటీలను అలవర్చుకోవడం

* సమస్యలను నివేదించడం, పరిష్కారాలను పొందడం: ఎలాంటి సమస్యలకు అయినా తక్షణ పరిష్కారాలు లభిస్తాయి.

* మై భారత్ హెల్ప్‌డెస్క్: మీకు ఎప్పుడూ సహాయం చేయడానికి అందుబాటులో ఉంటుంది.

మరీ ముఖ్యంగా ఇదంతా ఇప్పుడు మీ వాట్సాప్‌లో, మీకు అర్థమైన భాషలో లభిస్తాయి.

రాబోయే అప్‌డేట్‌లలో ఈ యాప్‌లో మరిన్ని అద్భుతమైన ఫీచర్లు లభిస్తాయి:

* డైరెక్ట్ రిజిస్ట్రేషన్: యాప్‌లోనే నేరుగా నమోదు చేసుకునే సౌలభ్యం.

* ఈవెంట్‌ల కోసం ఫోటో-వీడియో అప్‌లోడ్: మీరు పాల్గొన్న కార్యక్రమాల ఫోటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయవచ్చు.

* సర్టిఫికేట్‌లు, డాక్యుమెంట్ల డెలివరీ: సర్టిఫికేట్‌లు, ఇతర డాక్యుమెంట్లు నేరుగా మీకు అందుతాయి.

* రిమైండర్‌లు, ఫాలో-అప్‌లు, టాస్క్ ట్రాకింగ్: ముఖ్యమైన పనులను గుర్తుచేయడం, వాటి పురోగతిని ట్రాక్ చేయడం.

* ప్రభుత్వ పథకాల సమాచారం: ప్రభుత్వ పథకాల వివరాలు నేరుగా మీ మొబైల్‌కు.

ప్రభుత్వం వాట్సాప్ ద్వారా యువతకు చేరువ అవ్వడం అనేది చాలా మంచి నిర్ణయం. ఇది డిజిటల్ ఇండియా లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని యువతకు కూడా ప్రభుత్వ సేవలు, అవకాశాలు సులువుగా అందుబాటులోకి వస్తాయి. ఈ చాట్‌బాట్ యువతకు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడంలో, సమాజ సేవలో భాగం అవ్వడంలో గొప్ప సహాయకారి అవుతుంది.

Tags:    

Similar News