ITR Filing: భార్యాభర్తలు ఇద్దరూ ఓనర్లు అయితే..అద్దె ఆదాయంపై పన్ను ఎవరు కట్టాలి?
అద్దె ఆదాయంపై పన్ను ఎవరు కట్టాలి?;
ITR Filing: ప్రస్తుతం ఐటీఆర్ ఫైల్ చేసే సమయం కావడంతో చాలా మందికి పలు అనుమానాలు ఉంటాయి. ముఖ్యంగా ఇంటిని అద్దెకు ఇచ్చిన వారు, ఆ ఆదాయంపై పన్ను ఎలా కట్టాలి, పన్ను ఉంటుందా లేదా అనే సందేహాలు ఉంటాయి. ఇంకా, ఒక ఇల్లు భార్యాభర్తలు ఇద్దరి పేరు మీద ఉంటే, అద్దె ఆదాయంపై పన్ను ఎవరు కట్టాలి? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ వార్తలో తెలుసుకుందాం. ఇందుకోసం ఇన్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ స్పష్టమైన నియమాలను రూపొందించింది.
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 26 ప్రకారం, ఒక ఇల్లు భార్యాభర్తలిద్దరి పేరుపై ఉన్నప్పుడు, ఆ అద్దె ఆదాయాన్ని ఇద్దరూ పంచుకోవాల్సి ఉంటుంది. ఎవరి వాటా ఎంత అనేది ముందుగా నిర్ణయించుకోవచ్చు. ఆ వాటా ప్రకారం పన్నును విడిగా లెక్కించి, ఇద్దరూ వారి వారి ఆదాయ పన్ను రిటర్నులలో చూపించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు, ఒక ఇంటికి నెలకు రూ. 30,000 అద్దె వస్తే, భార్యాభర్తలు ఇద్దరూ రూ. 15,000 చొప్పున పంచుకోవచ్చు. దీనిపై పన్నును విడివిడిగా కట్టాలి. అంతేకాకుండా, ఇద్దరూ సెక్షన్ 24 కింద పన్ను మినహాయింపులను విడిగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ నియమం అద్దె ఆదాయంపై పన్ను చెల్లింపులో పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరూ వారి వాటాకు సరిపడా పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది.