DigitalPartnership : 6G టెక్నాలజీ నుంచి సైబర్ సెక్యూరిటీ వరకు మెగా ప్లాన్..డిజిటల్ దునియాలో భారత్-జర్మనీ దోస్తీ

డిజిటల్ దునియాలో భారత్-జర్మనీ దోస్తీ

Update: 2026-01-17 11:16 GMT

DigitalPartnership : భారత్, జర్మనీల మధ్య స్నేహం ఇప్పుడు డిజిటల్ దిశగా సరికొత్త అడుగులు వేస్తోంది. టెలికాం,డిజిటల్ రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనిని జాయింట్ డిక్లరేషన్ ఆఫ్ ఇంటెంట్ అని పిలుస్తున్నారు. సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను నెలకొల్పడమే ఈ భాగస్వామ్యం ముఖ్య ఉద్దేశం.జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడరిక్ మర్జ్ ఇటీవలే (జనవరి 12-13) భారత్‌లో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఆయన జరిపిన చర్చల ఫలితంగానే ఈ కీలక ఒప్పందం కుదిరింది. భారత టెలికాం కార్యదర్శి అమిత్ అగర్వాల్, జర్మనీ రాయబారి ఫిలిప్ ఎకర్‌మన్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కేవలం ఆలోచనలు పంచుకోవడమే కాకుండా, సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలను క్షేత్రస్థాయిలోకి తీసుకురావడమే ఈ డీల్ ప్రధాన లక్ష్యం.

5G/6G, సైబర్ సెక్యూరిటీపై ఫోకస్

ఈ ఒప్పందం ప్రకారం.. భారత్, జర్మనీ కలిసి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలైన 5G, 6G లపై పరిశోధనలు చేయనున్నాయి. అంతేకాకుండా పెరుగుతున్న సైబర్ దాడుల నేపథ్యంలో డిజిటల్ మౌలిక సదుపాయాలను కాపాడేందుకు సైబర్ సెక్యూరిటీ పై ప్రత్యేక దృష్టి సారించనున్నాయి. టెలికాం తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ వంటి అంశాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. ఇది భారతీయ టెలికాం రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకువస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

పని కోసం ప్రత్యేక వర్కింగ్ గ్రూపులు

ఈ భాగస్వామ్యం కేవలం కాగితాలకే పరిమితం కాకుండా ఉండేందుకు ఇరు దేశాలు ప్రత్యేక వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయనున్నాయి. ఇందులో ప్రభుత్వ అధికారులతో పాటు పరిశ్రమల అధిపతులు, పరిశోధనా సంస్థలు, విద్యావేత్తలు కూడా భాగస్వాములు అవుతారు. అంతర్జాతీయ వేదికలపై కూడా టెలికాం, డిజిటల్ అభివృద్ధిపై భారత్, జర్మనీలు ఒకే తాటిపై నిలబడి తమ వాణిని వినిపించనున్నాయి. ఈ ఒప్పందం వల్ల పెట్టుబడులు పెరగడమే కాకుండా, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Tags:    

Similar News