ITR Filing : ఐటీఆర్ ఫైలింగ్ ఇక చాలా ఈజీ.. ఆ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే చాలు!

ఆ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే చాలు!

Update: 2025-09-09 09:27 GMT

ITR Filing : ఐటీఆర్ దాఖలు చేసే గడువు ప్రభుత్వం సెప్టెంబర్ 15 వరకు పొడిగించింది. ఈ గడువు ముగియడానికి పది రోజుల కంటే తక్కువ సమయం ఉంది. పన్ను చెల్లింపుదారులకు ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి, కేంద్ర ప్రభుత్వం రెండు అధికారిక యాప్‌లను విడుదల చేసింది. అవి: AIS యాప్, ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ యాప్.

ఐటీఆర్ ఫైలింగ్‌ను ఈ యాప్స్ ఎలా సులభం చేస్తాయి?

ఈ మొబైల్ యాప్‌లు ముఖ్యంగా జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు, చిన్న వ్యాపారులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇంతకుముందు ఐటీఆర్ ఫైలింగ్ కోసం డెస్క్‌టాప్ లేదా మీడియేటర్లను ఆశ్రయించాల్సి వచ్చేది. కానీ ఈ యాప్‌లతో, మీ మొబైల్ నుంచే సులభంగా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఈ యాప్‌ల ద్వారా మీరు పొందే ప్రయోజనాలు..

1. ఈజీ లాగిన్:

పన్ను చెల్లింపుదారులు తమ పాన్ నంబర్, ఆధార్ ఐడీ, పాస్‌వర్డ్ ఉపయోగించి సులభంగా యాప్‌లో లాగిన్ అవ్వవచ్చు. దీంతో ఎక్కడి నుంచైనా మీ ఐటీఆర్ వివరాలను యాక్సెస్ చేయవచ్చు.

2. ఆటోమేటిక్ డేటా

మీరు యాప్‌లో లాగిన్ అయిన తర్వాత యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీలో మీ సమాచారం ముందుగానే నింపబడి ఉంటుంది. మీ జీతం, బ్యాంక్ వివరాలు, మ్యూచువల్ ఫండ్స్, ఇతర పెట్టుబడుల డేటా అంతా ఆటోమేటిక్‌గా వస్తుంది. దీనివల్ల మీరు మాన్యువల్‌గా వివరాలు నమోదు చేయాల్సిన అవసరం చాలా వరకు తగ్గుతుంది.

3. సరైన ఐటీఆర్ ఫారమ్‌ను ఎంచుకోవడంలో సాయం

ఈ యాప్‌లు మీ ఆదాయం (జీతం, పెన్షన్, మూలధన లాభాలు లేదా ఇతర ఆదాయం) ఆధారంగా మీకు ఏ ఐటీఆర్ ఫారమ్ సరైనదో స్వయంగా సూచిస్తాయి. దీనివల్ల తప్పుడు ఫారమ్ ఎంచుకునే అవకాశం ఉండదు.

4. వివరాలను సరిచేసుకునే అవకాశం

ఒకవేళ యాప్‌లో ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే లేదా మీరు ఏదైనా వివరాలు నమోదు చేయడం మర్చిపోతే, వాటిని మీరు మాన్యువల్‌గా సరిచేసుకోవచ్చు. ఉదాహరణకు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ లేదా ఇంటి అద్దె ఆదాయం వంటి వాటిని మీరు స్వయంగా జోడించవచ్చు.

5. ఈ-వెరిఫికేషన్, సబ్మిషన్:

రిటర్న్ ఫైలింగ్ పూర్తయిన తర్వాత, మీరు ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ లేదా డిజిటల్ సిగ్నేచర్ ఉపయోగించి ఈ-వెరిఫికేషన్ చేయవచ్చు. వెరిఫికేషన్ అయిన వెంటనే మీ రిటర్న్ సమర్పించబడుతుంది.

ఈ మొబైల్ యాప్‌లు ఐటీఆర్ ఫైలింగ్ ప్రక్రియను చాలా సులభతరం చేశాయి. ఇది ముఖ్యంగా చిన్న పన్ను చెల్లింపుదారులకు, మధ్యవర్తులపై ఆధారపడకుండా తమ పన్నులను స్వయంగా సమర్పించుకోవడానికి మంచి అవకాశం కల్పిస్తాయి.

Tags:    

Similar News