Internet Speed : జపాన్ సంచలనం.. ఇంటర్నెట్ స్పీడ్‌లో వరల్డ్ రికార్డ్!
ఇంటర్నెట్ స్పీడ్‌లో వరల్డ్ రికార్డ్!;
Internet Speed :ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో ఏ దేశం ముందుంది అనే ప్రశ్నకు చాలా మందికి సరైన సమాధానం తెలియకపోవచ్చు. సాధారణంగా ఎవరైనా అమెరికా వద్దే ఉందని అనుకుంటారు. ఇటీవల నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (జపాన్) పరిశోధకులు అడ్వాన్స్‌డ్ ఫైబర్ కేబుల్ ద్వారా అత్యంత వేగవంతమైన స్పీడ్‌ను సాధించారు. ఈ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉందంటే ఒకే సెకనులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం లైబ్రరీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జపాన్ 1.02 పెటాబిట్స్ ప్రతి సెకనుకు ఇంటర్నెట్ స్పీడ్ (ఇదిప్రతి సెకనుకు 1 మిలియన్ గిగాబైట్స్ తో సమానం) రికార్డును సృష్టించింది. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. జపాన్ స్పీడ్ అమెరికా సగటు ఇంటర్నెట్ స్పీడ్ కంటే 3.5 రెట్లు, భారతదేశ సగటు ఇంటర్నెట్ స్పీడ్ కంటే 1.6 కోట్ల రెట్లు ఎక్కువ. 1.02 పెటాబిట్స్ ప్రతి సెకనుకు - ఇది ఎంత వేగంగా ఉందంటే, ఒకే సెకనులో నెట్‌ఫ్లిక్స్ మొత్తం లైబ్రరీని మాత్రమే కాకుండా, 8K వీడియోలను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జపాన్ సింగిల్ కోర్ బదులుగా 19 కోర్ ఆప్టికల్ ఫైబర్ సిస్టమ్ సహాయంతో ఇంత వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను సాధించగలిగింది. ఇది కేవలం సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ గా మాత్రమే కాకుండా, డేటా ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీలో ఒక కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. ఈ ప్రత్యేక కేబుల్స్‌ను ఉపయోగించి పరిశోధకుల బృందం ఎటువంటి స్పీడ్ లాస్ లేకుండా 1800 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వరకు భారీ మొత్తంలో డేటాను పంపగలిగింది. డేటా కంప్లీట్ ఎనర్జీతో ప్రవహించేలా చేయడానికి వారు ట్రాన్స్‌మిటర్, రిసీవర్, లూపింగ్ సర్క్యూట్ సెటప్‌ను ఉపయోగించారు. ప్రస్తుతం, మిగిలిన ప్రపంచం పెద్ద ఫైల్‌లు డౌన్‌లోడ్ అవ్వడానికి లేదా స్ట్రీమ్‌లు బఫర్ అవ్వడానికి వేచి చూస్తున్నప్పటికీ, జపాన్ రేపటి ఇంటర్నెట్ ఎలా ఉంటుందో సైలెంటుగా మనకు చూపిస్తోంది.