Reliance Jio : రూ.601కే ఏడాది పాటు 5G డేటా.. జియో ప్లాన్ అదుర్స్

జియో ప్లాన్ అదుర్స్;

Update: 2025-07-18 11:57 GMT

Reliance Jio : రిలయన్స్ జియో వద్ద తక్కువ ధర, ఎక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌లు చాలా ఉన్నాయి. తక్కువ ధరకే అన్‌లిమిటెడ్ 5G డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ ధర కేవలం రూ.601. జియో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ అన్‌లిమిటెడ్ 5G డేటాతో వస్తుంది, అయితే ఈ ప్లాన్‌కు ఒక షరతు కూడా ఉంది. అది తప్పకుండా పాటించాలి. ఆ షరతు ఏమిటి, ఈ ప్లాన్‌తో ఏయే ప్రయోజనాలు లభిస్తాయి? వివరంగా తెలుసుకుందాం. రిలయన్స్ జియో ప్రకారం, ఈ రూ.601 ప్లాన్ నాన్-5G ప్లాన్‌ను అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌గా అప్‌గ్రేడ్ చేస్తుంది.

ఈ ప్లాన్‌కు ఉన్న షరతు ఏమిటంటే.. మీరు లేదా మీరు ఎవరికైతే ఈ రూ.601 వోచర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారి వద్ద కచ్చితంగా రోజుకు 1.5 GB హై-స్పీడ్ డేటా ఉన్న ప్లాన్ యాక్టివ్‌గా ఉండాలి. ఈ కండీషన్ బట్టి చూస్తే 601 ప్లాన్ ప్రయోజనం రోజుకు 1GB డేటా ప్లాన్ వాడుతున్న వారికి లేదా రూ.1899 ప్లాన్ తీసుకున్న వారికి లభించదు. రూ.601 ఖర్చు చేస్తే, రిలయన్స్ జియో మీకు 12 వోచర్లను ఇస్తుంది. అంటే నెలకు ఒక వోచర్ అన్నమాట.

రూ.601 వోచర్‌ను కొనుగోలు చేయడానికి మీరు ముందుగా https://www.jio.com/gift/true-5g అనే వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ఆ తర్వాత మీరు మీ నంబర్‌ను లేదా ఎవరికైతే వోచర్ గిఫ్ట్ చేయాలనుకుంటున్నారో వారి జియో నంబర్‌ను ఎంటర్ చేయాలి. మీరు పేమెంట్ చేసిన వెంటనే, ఈ రూ.601 వోచర్ యాక్టివేట్ అవుతుంది. వోచర్‌ను రీడీమ్ చేసుకోవడానికి.. ముందుగా మై జియో యాప్ ఓపెన్ చేయండి. ఆ తర్వాత వోచర్ సెక్షన్ లోకి వెళ్లి, వోచర్‌ను రీడీమ్ చేసుకోండి.

Tags:    

Similar News