Reliance Jio : జియో యూజర్లకు పండగే.. ఈ ప్లాన్‌తో రూ.50 క్యాష్‌బ్యాక్
ఈ ప్లాన్‌తో రూ.50 క్యాష్‌బ్యాక్;
Reliance Jio : రిలయన్స్ జియో ప్రీపెయిడ్ సిమ్ వాడుతున్నారా? అయితే మీకోసం కంపెనీ దగ్గర ఒక అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ఉంది. ఇది మంచి బెనిఫిట్స్ ఇవ్వడమే కాకుండా, క్యాష్‌బ్యాక్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ ధర రూ.1028. క్యాష్‌బ్యాక్ బెనిఫిట్ ఇచ్చే జియో ప్లాన్‌లలో ఇది ఏకైకది. రూ.50 క్యాష్‌బ్యాక్‌తో పాటు ఈ ప్లాన్‌తో మీకు ఇంకేం లాభాలు వస్తాయో వివరంగా తెలుసుకుందాం.
రూ.1028 విలువైన ఈ రిలయన్స్ జియో రీఛార్జ్ ప్లాన్‌తో ప్రతిరోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. డేటా, కాలింగ్, ఎస్సెమ్మెస్‌లతో పాటు, ఈ ప్లాన్ జియో అన్‌లిమిటెడ్ ఆఫర్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 90 రోజుల పాటు జియో హాట్‌స్టార్, 50 జీబీ ఉచిత ఏఐ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తాయి.
వాలిడిటీ విషయానికి వస్తే రూ.1028 విలువైన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 84 రోజుల వాలిడిటీ ఇస్తుంది. ప్రతిరోజూ 2 జీబీ డేటా, 84 రోజుల వాలిడిటీ ప్రకారం చూస్తే, ఈ రీఛార్జ్ ప్లాన్ మొత్తం 168 జీబీ హై-స్పీడ్ డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్‌తో కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
రిలయన్స్ జియో నుంచి 3 నెలల స్విగ్గీ వన్ లైట్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. దీని ద్వారా మీకు రూ.600 విలువైన బెనిఫిట్స్ లభిస్తాయి. స్విగ్గీ బెనిఫిట్ కాకుండా, ఈ ప్లాన్‌ను రీఛార్జ్ చేస్తే రూ.50 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంతేకాకుండా, ఈ ప్లాన్‌తో జియో క్లౌడ్, జియో టీవీ యాక్సెస్ కూడా లభిస్తుంది.
ప్రస్తుతానికి, ప్రీపెయిడ్ యూజర్ల కోసం ఎయిర్‌టెల్ దగ్గర క్యాష్‌బ్యాక్ ఇచ్చే ప్లాన్ ఏదీ అందుబాటులో లేదు. అయితే, రూ.1028 జియో ప్లాన్‌కు పోటీగా ఎయిర్‌టెల్ దగ్గర రూ.1029 ప్లాన్ ఉంది. ఎయిర్‌టెల్ ఈ ప్లాన్ ప్రతిరోజూ 2 జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లను అందిస్తుంది. 84 రోజుల వాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌తో 3 నెలల పాటు జియో హాట్‌స్టార్ మొబైల్, స్పామ్ అలర్ట్, ఉచిత హెలోట్యూన్ బెనిఫిట్ లభిస్తుంది.