Jio 449 Plan : బిర్యానీ ధరకే నెలంతా డేటా..జియో లేటెస్ట్ ప్లాన్ చూశారా?

జియో లేటెస్ట్ ప్లాన్ చూశారా?

Update: 2026-01-15 07:13 GMT

Jio 449 Plan : మీరు ఇంటర్నెట్‌ను ఎక్కువగా వాడుతుంటారా? వీడియో స్ట్రీమింగ్ లేదా వర్క్ కోసం ఎక్కువ డేటా అవసరమా? అయితే జియో అందిస్తున్న రూ.449 ప్లాన్ మీకోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది జియోలో లభించే అత్యంత చౌకైన డైలీ 3GB డేటా ప్లాన్. సాధారణంగా ఇలాంటి ప్లాన్లు ఖరీదుగా ఉంటాయి, కానీ జియో దీనిని సామాన్యులకు అందుబాటులో ఉండేలా అందిస్తోంది.

ప్లాన్ పూర్తి వివరాలు, వాలిడిటీ

ఈ ప్లాన్ ద్వారా మీకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ప్రతిరోజూ 3GB హై-స్పీడ్ డేటా వస్తుంది, అంటే మొత్తం వాలిడిటీ కాలానికి గాను 84GB డేటా మీ సొంతం. డేటాతో పాటుగా ఏదైనా నెట్‌వర్క్‌కు అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు. అలాగే రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు కూడా లభిస్తాయి.

అన్‌లిమిటెడ్ 5G డేటా

ఒకవేళ మీరు 5G నెట్‌వర్క్ ఉన్న ప్రాంతంలో ఉండి, మీ వద్ద 5G స్మార్ట్‌ఫోన్ ఉంటే.. మీరు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Unlimited 5G డేటాను ఎంజాయ్ చేయవచ్చు. అంటే రోజువారీ 3GB పరిమితితో సంబంధం లేకుండా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.ఈ ప్లాన్‌తో కేవలం డేటా మాత్రమే కాదు, మరికొన్ని ప్రీమియం సర్వీసులు కూడా ఉచితంగా లభిస్తాయి. మూడు నెలల పాటు జియో హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితం. 50GB వరకు జియో క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. సుమారు రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో యాక్సెస్ ఈ ప్లాన్‌తో లభిస్తుంది (ఇది 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వర్తిస్తుంది).కొత్త జియో హోమ్ కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి 2 నెలల ఉచిత ట్రయల్ అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News