Aadhaar : ఇక పిల్లల ఆధార్ అప్ డేట్ ఇక స్కూళ్లలోనే.. UIDAI సంచలన నిర్ణయం!
UIDAI సంచలన నిర్ణయం!;
Aadhaar : పిల్లల ఆధార్ అప్‌డేట్‌పై ఉడాయ్(UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై స్కూళ్లలోనే పిల్లల బయోమెట్రిక్ అప్‌డేట్‌లు జరిగేలా ఒక మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఆధార్ కస్టోడియన్ ఆర్గనైజేషన్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఐదు సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. అయితే, 7 కోట్ల మందికి పైగా పిల్లలు ఇంకా తమ బయోమెట్రిక్స్‌ను అప్‌డేట్ చేసుకోలేదని యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ వెల్లడించారు.
తల్లిదండ్రుల అనుమతితో స్కూళ్ల ద్వారా పిల్లల బయోమెట్రిక్స్ అప్‌డేట్ చేసే ప్రాజెక్ట్‌పై యూఐడీఏఐ పనిచేస్తోందని భువనేష్ కుమార్ తెలిపారు. పిల్లల డేటా నిర్వహించడానికి తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ సకాలంలో పూర్తి చేయడం చాలా ముఖ్యం. 7 సంవత్సరాల వయస్సు తర్వాత కూడా ఆధార్ అప్ డేట్ చేయకపోతే ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఆధార్ నంబర్ డీయాక్టివేట్ అవుతుంది. బయోమెట్రిక్ ఐదు నుండి ఏడు సంవత్సరాల వయస్సు మధ్య చేస్తే ఉచితం, కానీ ఏడు సంవత్సరాల వయస్సు తర్వాత అప్‌డేట్ చేయడానికి రూ.100 రుసుము ఉంటుంది.
అప్‌డేట్ చేయబడిన బయోమెట్రిక్ గుర్తింపుతో కూడిన ఆధార్ జీవితాన్ని సులభతరం చేస్తుంది. స్కూల్‌లో ప్రవేశం, ప్రవేశ పరీక్షలకు నమోదు, స్కాలర్‌షిప్‌లు పొందడం, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పథకాలు మొదలైన సేవలను సులభంగా పొందడంలో ఆధార్ నిరాటంకంగా ఉపయోగపడేలా చూస్తుంది. పిల్లలు 15 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత చేసే రెండవ బయోమెట్రిక్ కోసం కూడా స్కూళ్లు, కాలేజీలలో అదే ప్రక్రియను కొనసాగించాలని తాము ప్లాన్ చేస్తున్నామని భువనేష్ కుమార్ చెప్పారు.