LIC : పది పాసైతే చాలు.. ఎల్ఐసీలో ఉద్యోగం

ఎల్ఐసీలో ఉద్యోగం;

Update: 2025-08-01 06:15 GMT

LIC : భారతదేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మహిళలను ప్రోత్సహించడానికి బీమా సఖి అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా మహిళలు బీమా రంగంలో తమ కెరీర్‌ను ప్రారంభించవచ్చు. ఎల్ఐసీ తన మహిళా కెరీర్ ఏజెంట్ పథకం కింద బీమా సఖిలను నియమించుకుంటుంది. ఈ పథకంలో చేరిన మహిళలకు నెలకు రూ.7,000 స్టైపెండ్‌తో పాటు అదనపు కమిషన్ కూడా లభిస్తుంది.

బీమా సఖిగా చేరడానికి అర్హతలు

* దరఖాస్తు చేసుకునే మహిళల వయస్సు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

* కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

* గరిష్ట వయస్సు 70 సంవత్సరాలు దాటకూడదు.

* ప్రస్తుతం ఉన్న LIC ఏజెంట్లు, ఉద్యోగులు, వారి దగ్గరి బంధువులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు లేదా మాజీ ఏజెంట్లు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి అనర్హులు.

మూడు సంవత్సరాల పాటు స్టైపెండ్

బీమా సఖిగా నియమితులైన వారికి మొదటి సంవత్సరంలో నెలకు రూ.7,000 స్టైపెండ్ లభిస్తుంది. ఈ సమయంలో వారికి సీనియర్ ఏజెంట్ల ద్వారా ట్రైనింగ్ ఇస్తారు. మొదటి సంవత్సరంలో వారు విక్రయించిన పాలసీలలో 65% యాక్టివ్‌గా ఉంటే, రెండో సంవత్సరంలో వారికి నెలకు రూ.6,000 స్టైపెండ్ ఇస్తారు. రెండో సంవత్సరంలో కూడా 65% పాలసీలు యాక్టివ్‌గా ఉంటే, మూడో సంవత్సరంలో వారికి నెలకు రూ.5,000 స్టైపెండ్ లభిస్తుంది.

బీమా సఖి ఏజెంట్లు ఒక సంవత్సరంలో కనీసం 24 కొత్త లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను విక్రయించాలి. దీనితో పాటు, బోనస్ కమిషన్ కాకుండా, ఒక సంవత్సరంలో ₹48,000 కమిషన్ సంపాదించాలి. ఈ లక్ష్యాలను చేరుకున్న వారికి మాత్రమే స్టైపెండ్ లభిస్తుంది. ఈ పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి, తమ కెరీర్‌ను నిర్మించుకోవడానికి ఒక మంచి అవకాశం లభిస్తుంది.

Tags:    

Similar News