Cibil Score : సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్.. ఈ కొత్త రూల్స్ ఇవే

ఈ కొత్త రూల్స్ ఇవే;

Update: 2025-08-25 06:13 GMT

Cibil Score : సాధారణంగా లోన్ కావాలంటే మంచి సిబిల్ స్కోర్ తప్పనిసరి. ముఖ్యంగా కొత్తగా లోన్ తీసుకునేవారికి సిబిల్ స్కోర్ ఉండదు. దీనివల్ల చాలామంది బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందలేకపోతున్నారు. అయితే ఇప్పుడు కొత్తగా లోన్ తీసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. సిబిల్ స్కోర్ లేకపోయినా లోన్ ఇచ్చేందుకు బ్యాంకులు అంగీకరించాలి అనే నిబంధన తీసుకొచ్చింది.

లోక్‌సభ సమావేశాల్లో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కీలక ప్రకటన చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం, సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా, లేదా స్కోర్ లేకపోయినా కేవలం ఆ కారణంతో లోన్ అప్లికేషన్ ని బ్యాంకులు తిరస్కరించలేవని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా లోన్ తీసుకునేవారు అంటే, ఇంతకు ముందు ఎప్పుడూ లోన్ తీసుకోని వారికి సిబిల్ స్కోర్ ఉండదు. అలాంటి వారిని లోన్ కోసం అప్లై చేసినప్పుడు వెనక్కు పంపడం సరికాదని ఆర్బీఐ బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది.

సిబిల్ స్కోర్ లేకపోతే ఎలా లోన్ ఇస్తారు?

సిబిల్ స్కోర్ లేదని లోన్ ఇవ్వడం మానేయకపోయినా, బ్యాంకులు అప్లికేషన్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి గతంలో ఏదైనా అప్పు చేశారా, చేసిన అప్పులని సకాలంలో తిరిగి చెల్లించారా లేదా అనే విషయాలన్నీ బ్యాంకులు పరిశీలిస్తాయి. దీనిని డ్యూ డిలిజెన్స్ అని అంటారు. సిబిల్ స్కోర్ అనేది ఒక అదనపు డాక్యుమెంట్ మాత్రమే అవుతుంది, అదే ఫైనల్ నిర్ణయం కాదు. బ్యాంకులు తమ సొంత పాలసీలు, కస్టమర్ ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి లోన్ ఇవ్వాలా లేదా అని నిర్ణయిస్తాయి.

సిబిల్ స్కోర్ అంటే ఏమిటి?

సిబిల్ స్కోర్ అనేది ఒక మూడు అంకెల సంఖ్య. ఇది ఒక వ్యక్తి అప్పు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించగలరా లేదా అని చూపిస్తుంది. ఈ స్కోర్ 300 నుండి 900 మధ్య ఉంటుంది. స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఆ వ్యక్తి ఆర్థిక క్రమశిక్షణ అంత బాగున్నట్టు లెక్క. CIBIL (Credit Information Bureau India Limited) అనే సంస్థ ఈ స్కోర్ ను రూపొందిస్తుంది. బ్యాంకులు లోన్ ఇవ్వడానికి ముందు కస్టమర్ ఆర్థిక చరిత్రను తెలుసుకోవడానికి ఈ స్కోర్ ను పరిశీలిస్తాయి.

Tags:    

Similar News