Sahara Refund : సహారా రిఫండ్ రిజెక్ట్ అయిందా? .. డోంట్ వర్రీ మళ్లీ ఇలా అప్లై చేయండి

డోంట్ వర్రీ మళ్లీ ఇలా అప్లై చేయండి;

Update: 2025-06-30 03:38 GMT

Sahara Refund : సహారా గ్రూప్ కు చెందిన నాలుగు కోఆపరేటివ్ సొసైటీలలో డబ్బులు జమ చేసిన వాళ్ల కోసం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్స్ ఒక కొత్త పోర్టల్‌ను ప్రారంభించింది. దాని పేరే CRCS సహారా రీ-సబ్‌మిషన్ రిఫండ్ పోర్టల్. ఈ పోర్టల్ ఎవరికంటే ఇంతకుముందు రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అది రిజెక్ట్ అయిన వారికి లేదా డాక్యుమెంట్లు సరిగా లేని వారికి. ఈ పోర్టల్‌లో 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్ చేసుకోవచ్చు. వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం.

సుప్రీంకోర్టు ఆదేశాలతో రీ-సబ్‌మిషన్ పోర్టల్!

సుప్రీంకోర్టు 2023 మార్చి 29న ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ ప్రక్రియను మొదలుపెట్టారు. సహారా గ్రూప్‌కు చెందిన నాలుగు సహకార సంఘాలలో నిజంగా డబ్బులు జమ చేసిన వారికి తిరిగి వారి డబ్బును ఇప్పించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆ నాలుగు సొసైటీలు హుమారా ఇండియా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (కోల్‌కతా), సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (లక్నో), సహారాయన్ యూనివర్సల్ మల్టీపర్పస్ సొసైటీ లిమిటెడ్ (భోపాల్), స్టార్స్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ (హైదరాబాద్).

ఎవరు రీ-సబ్‌మిషన్ చేయొచ్చు?

CRCS సహారా రీ-సబ్‌మిషన్ రిఫండ్ పోర్టల్ కేవలం ఎవరి దరఖాస్తులు అయితే పేమెంట్స్ లేదా డాక్యుమెంట్ల లోపం వల్ల రిజెక్ట్ చేయబడ్డాయో వారికోసం మాత్రమే. CRCS సహారా రిఫండ్ పోర్టల్‌లో కమిషన్ మెసేజ్ వచ్చిన ఇన్వెస్టర్లు, తమ 14-అంకెల క్లెయిమ్ రిక్వెస్ట్ నంబర్ (CRN) ద్వారా లాగిన్ అవ్వొచ్చు. మొదటిసారి దరఖాస్తు చేసుకునే కొత్త ఇన్వెస్టర్లు వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అయితే, ఒక విషయం గుర్తుంచుకోవాలి.. ఎవరి దరఖాస్తులు అయితే 45 రోజులు పూర్తయ్యాయో, వారే రీ-సబ్‌మిషన్ చేయడానికి అర్హులు. అంటే, 45 రోజులు గడిచిన తర్వాతే మళ్లీ దరఖాస్తు చేయగలరు.

రీ-సబ్‌మిషన్ ప్రాసెస్ ఇదే! (ఈజీగా చేసుకోవచ్చు!)

* రీ-సబ్‌మిషన్ చేయడానికి ముందుగా CRCS పోర్టల్‌కు వెళ్లాలి.

* అక్కడ మీ 14 అంకెల CRN కోడ్‌ను ఎంటర్ చేయాలి.

* తర్వాత Captcha కోడ్‌ను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

* మీరు లాగిన్ అవ్వగానే, సిస్టమ్ మీ CRN కి లింక్ అయిన ఆధార్ నంబర్‌ను వెరిఫై చేస్తుంది.

* మీ CRN సరైనది అయితే, మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.

* ఒకవేళ మీ CRN తప్పుగా ఉంటే, అప్పుడు మీరు మీ 12-అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

* ఈ పద్ధతిని పాటిస్తే, మీ రిఫండ్ అప్లికేషన్‌ను విజయవంతంగా రీ-సబ్‌మిట్ చేయగలరు.

Tags:    

Similar News