One Flat Costs ₹500 Crore: ఒక ఫ్లాట్ ధర రూ.500 కోట్లు.. సన్‌టెక్ రియాల్టీ అత్యంత విలాసవంత ప్రాజెక్టు!
సన్‌టెక్ రియాల్టీ అత్యంత విలాసవంత ప్రాజెక్టు!
One Flat Costs ₹500 Crore: భూమి, నిర్మాణ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. హైదరాబాద్‌లోనే కొన్ని ఫ్లాట్ల ధరలు రూ.10 కోట్లు దాటుతుండగా, గురుగ్రామ్‌లో డీఎల్‌ఎఫ్ సంస్థ నిర్మిస్తున్న కామెలియాస్ అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్ ధర రూ.100 కోట్లు పలుకుతోంది. ఇప్పుడు సన్‌టెక్ రియాల్టీ సంస్థ కొత్తగా నిర్మించబోయే అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్ల ధరలు కనిష్ఠంగా రూ.100 కోట్లు, గరిష్ఠంగా రూ.500 కోట్లు ఉండనున్నాయి.
ఎమాన్సే బ్రాండ్ పేరుతో అత్యంత లగ్జరీగా నిర్మించనున్న ఈ నివాస సముదాయాలు ముంబయి, దుబాయ్‌లలో ఏర్పాటు కానున్నాయి. ఈ రెండు ప్రాజెక్టుల నుంచి రూ.20,000 కోట్ల ఆదాయాన్ని ఆశిస్తున్నట్లు సన్‌టెక్ రియాల్టీ సీఎండీ కమల్ ఖేతన్ వెల్లడించారు. వచ్చే జూన్ నాటికి ఈ ప్రాజెక్టుల పనులు ప్రారంభమవుతాయని ఆయన తెలిపారు. దేశంలో సంపన్నుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి విలాసవంత ప్రాజెక్టులకు డిమాండ్ ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ అపార్ట్‌మెంట్లలో చదరపు అడుగు నిర్మాణ ఖర్చు రూ.2.50 లక్షలుగా ఉండనుంది. ఇది దేశంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాల్లో ఒకటిగా నిలవనుంది. రియల్ ఎస్టేట్ రంగంలో పెరుగుతున్న ధరలు, విలాస సౌకర్యాలు సంపన్నులను ఆకర్షిస్తున్నాయి.