Personal Loan : బ్యాంకులు తిరస్కరించినా..నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి లోన్ ఎలా పొందాలి?
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల నుంచి లోన్ ఎలా పొందాలి?
Personal Loan : జీవితంలో పెద్ద ఖర్చులు ఎప్పుడు వస్తాయో ఎవరూ చెప్పలేరు. పిల్లల చదువు, పెళ్లిళ్లు, లేదా అనుకోని ఆరోగ్య సమస్యలు వంటి వాటికి డబ్బు అవసరం అవుతుంది. మన దగ్గర పొదుపు లేదా ఎమర్జెన్సీ ఫండ్ లేకపోతే వెంటనే పర్సనల్ లోన్ కోసం బ్యాంకు వైపు చూస్తాం. కానీ బ్యాంకుల్లో లోన్ ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. డాక్యుమెంట్ల పరిశీలన ఎక్కువ, క్రెడిట్ స్కోర్ కొద్దిగా తక్కువ ఉన్నా లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. అలాంటి అత్యవసర పరిస్థితుల్లో మనకు పెద్ద ఉపశమనాన్ని ఇచ్చేవే NBFCs (నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు).
NBFCs ముఖ్యంగా బ్యాంకుల్లో లోన్ దొరకని వారికి లేదా తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారికి త్వరగా డబ్బు అందించడానికి ముందుకు వస్తాయి. బ్యాంకుల కంటే NBFCs లో లోన్ ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. బ్యాంకుల్లాగా చాలా డాక్యుమెంట్లు అడగవు. KYC డాక్యుమెంట్లు క్లియర్‌గా ఉంటే లోన్ త్వరగా మంజూరు అవుతుంది. NBFCs లో లోన్ అప్రూవల్ టైం బ్యాంకుల కంటే చాలా తక్కువగా ఉంటుంది. క్రెడిట్ స్కోర్ కొంచెం తక్కువగా ఉన్నా, లేదా నెలవారీ ఆదాయం బ్యాంకులకు కావలసినంత స్థిరంగా లేకపోయినా, NBFCs లో లోన్ పొందడం సులభం. అందుకే, ఇది చాలా మందికి ఒక వరంగా కనిపిస్తుంది.
NBFCs లో లోన్ సులభంగా లభిస్తున్నప్పటికీ, దాని వెనుక ఉన్న పెద్ద రహస్యాన్ని ప్రతి కస్టమర్ తప్పకుండా తెలుసుకోవాలి. అదే వడ్డీ రేటు. సాధారణంగా NBFCs ఇచ్చే పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు, బ్యాంకులు ఇచ్చే వడ్డీ రేట్ల కంటే ఎక్కువగా ఉంటాయి. లోన్ త్వరగా, సులభంగా ఇచ్చేందుకు గానూ, వారు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు.
ప్రముఖ NBFCs ప్రారంభ వడ్డీ రేట్లు:
టాటా క్యాపిటల్ లోన్ రూ.40,000 నుంచి రూ.35 లక్షల వరకు ఇస్తారు. వడ్డీ రేట్లు సుమారు 11.50% నుంచి మొదలవుతాయి. ప్రాసెసింగ్ ఫీజు కూడా 3.5% వరకు ఉంటుంది. బజాజ్ ఫైనాన్స్ ప్రారంభ వడ్డీ రేటు సుమారు 10% నుంచి ఉంటుంది. ఇది కస్టమర్ ఆదాయం, క్రెడిట్ స్కోర్, తీసుకునే లోన్ మొత్తంపై ఆధారపడి మారుతుంది. శ్రీరామ్ ఫైనాన్స్ పర్సనల్ లోన్ వడ్డీ రేటు 11% నుంచి ప్రారంభమవుతుంది. ఇది ఆర్థిక ప్రొఫైల్‌ను బట్టి మారుతుంది.
ఆర్థిక నిపుణులు, సలహాదారులు చెప్పే ముఖ్య విషయం ఏమిటంటే.. NBFCs ఒక మంచి ప్రత్యామ్నాయం అయినప్పటికీ, లోన్ తీసుకునే నిర్ణయాన్ని తొందరపాటులో తీసుకోకూడదు. కస్టమర్ కేవలం వడ్డీ రేటు మాత్రమే కాకుండా, లోన్‌కు అయ్యే మొత్తం ఖర్చును చూడాలి. అంటే, ప్రాసెసింగ్ ఫీజు, వడ్డీ రేటు, ఒకవేళ EMI కట్టడం ఆలస్యమైతే విధించే లేట్ పేమెంట్ ఛార్జీలను కూడా లెక్కించాలి. లోన్ తీసుకోవడం ఒక పెద్ద ఆర్థిక బాధ్యత. ఈ అన్ని విషయాలను దృష్టిలో ఉంచుకుని NBFC నుంచి లోన్ తీసుకుంటే, మీ అవసరం తీరడంతో పాటు, భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.