India Poverty : భారత్ లో తగ్గిపోయిన పేదరికం.. ప్రపంచ బ్యాంక్ నివేదికలో ఆశ్చర్యకర విషయాలు
ప్రపంచ బ్యాంక్ నివేదికలో ఆశ్చర్యకర విషయాలు;
India Poverty : భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గుతోందని వివిధ సంస్థల నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్(World Bank) ఇటీవల విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గత దశాబ్దంలో నిరుపేదల సంఖ్య అద్భుతంగా తగ్గిందని వెల్లడైంది. ఇది భారత ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవన ప్రమాణాలలో వస్తున్న సానుకూల మార్పులకు నిదర్శనం.
11 ఏళ్లలో గణనీయంగా తగ్గిన నిరుపేదలు
భారతదేశంలో పేదరికం, నిరుపేదల (extreme poverty) సంఖ్య చాలా తగ్గిపోతుందని వివిధ సంస్థల గణాంకాల నుండి తెలుస్తోంది. ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం, నిరుపేదల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా తగ్గింది. 2011-12లో 27.1 శాతం ఉన్న నిరుపేదలు, 2022-23 నాటికి 5.3 శాతానికి తగ్గిపోయారు. నిరుపేదలను లెక్కించడానికి నిర్దేశించిన కనీస ఆదాయ స్థాయిని పెంచినప్పటికీ, ఈ స్థాయిలో తగ్గింపు జరగడం విశేషం.
నిరుపేదలు అంటే ఎవరు?
ఒక వ్యక్తి ఒక రోజు ఆదాయం 3 డాలర్లు (సుమారు 250 రూపాయలు) కంటే తక్కువగా ఉంటే వారిని నిరుపేదలుగా పరిగణిస్తారు. గతంలో ఈ కొలమానం 2.15 డాలర్లుగా ఉండేది. కానీ, ఇప్పుడు 2021లో అమలులో ఉన్న పర్చేసింగ్ పవర్ పారిటీ (Purchasing Power Parity - PPP) ఆధారంగా దీనిని పెంచారు. ఇంతకుముందు 2017 PPP ఆధారంగా లెక్కలు చేసేవారు. ఈ విధంగా నిరుపేదలను కొలవడానికి ప్రమాణాలను పెంచిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా నిరుపేదల సంఖ్య 12.5 కోట్లు పెరిగింది. కానీ, భారతదేశంలో మాత్రం ఆశ్చర్యకరంగా నిరుపేదల సంఖ్య తగ్గింది.
లక్షలాది మంది పేదల నుండి విముక్తి
2011-12లో భారతదేశంలో 34.45 కోట్ల మంది ప్రజలు నిరుపేదలుగా ఉండేవారు. 2022-23 నాటికి ఈ సంఖ్య 7.52 కోట్లకు తగ్గింది. పేదరికం ఎంత ఉంది అని తెలుసుకోవడానికి సరైన డేటా ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు చూపిస్తున్నాయని ప్రభుత్వ అభిప్రాయం.
పేదరికం కొలమానంలో మార్పు
భారతదేశం నిరుపేదలను కొలవడానికి ఉపయోగించే విధానంలో కొద్దిగా మార్పు చేసింది. గతంలో 'యూనిఫార్మ్ రెఫరెన్స్ పీరియడ్' (Uniform Reference Period) విధానాన్ని అనుసరించగా, ఇప్పుడు 'మాడిఫైడ్ మిక్సెడ్ రీకాల్ పీరియడ్' (Modified Mixed Recall Period) విధానాన్ని అనుసరించింది. దీనివల్ల దేశంలో వినియోగ (Consumption) స్థాయిని మరింత కచ్చితంగా అంచనా వేయడం సాధ్యమైంది. దీనితో పాటు పేదరికం స్థాయిని కూడా మరింత కచ్చితంగా అంచనా వేయడం సాధ్యమైంది. ఫలితంగా, భారతదేశంలో నిరుపేదల సంఖ్య తగ్గిందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.India Poverty, Extreme Poverty, World Bank Data, Poverty Reduction, Economic Growth, Living Standards