SBI: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భారీ జీతంతో కూడిన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ రంగాల్లో అనుభవం ఉన్న నిపుణుల కోసం బ్యాంక్ ప్రత్యేక నియామక ప్రక్రియ చేపట్టింది. ఇందులో జనరల్ మేనేజర్ అండ్ చీఫ్ AI ఆఫీసర్ పోస్టుకు ఏడాదికి గరిష్ఠంగా రూ.1.60 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ స్థాయి జీతం ప్రభుత్వ రంగ బ్యాంకులో ఉద్యోగాలపై ఆసక్తి ఉన్నవారి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే ఇది సాధారణ ఎంట్రీ లెవల్ ఉద్యోగం కాదు. ఉన్నత స్థాయి విద్యార్హతలు, సుదీర్ఘ అనుభవం, AI విభాగంలో నాయకత్వ నైపుణ్యాలు ఉన్నవారే ఈ పోస్టుకు అర్హులు. ఈ నియామక ప్రక్రియలో మొత్తం ఆరు పోస్టులు ఉన్నాయి.

రూ.1.6 కోట్ల ప్యాకేజీ.. జీతం వివరాలివే

ఎస్‌బీఐ విడుదల చేసిన అధికారిక ప్రకటన ప్రకారం.. చీఫ్ AI ఆఫీసర్ పోస్టుకు ఏడాదికి గరిష్ఠంగా రూ.1.60 కోట్లు CTC ఇవ్వనున్నారు. ఇందులో 90 శాతం స్థిర వేతనం, 10 శాతం పనితీరు ఆధారిత వేతనం ఉంటుంది. అంటే గరిష్ఠ ప్యాకేజీ లెక్కన రూ.1.44 కోట్లు ఫిక్స్‌డ్ పే కాగా, రూ.16 లక్షలు వేరియబుల్ పే రూపంలో లభిస్తాయి. అయితే ప్రతి ఒక్కరికీ రూ.1.60 కోట్లు వస్తాయని భావించకూడదు. అభ్యర్థి అనుభవం, ప్రస్తుతం పొందుతున్న జీతం, పోస్టింగ్ ప్రాంతం ఆధారంగా తుది ప్యాకేజీని చర్చించి నిర్ణయిస్తారు. పనితీరు ఆధారంగా వేరియబుల్ పే కూడా మారుతుంది. ఈ పోస్టుతో పాటు మూడు డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) పోస్టులకు రూ.1.20 కోట్ల వరకు, AI సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్‌ప్రైజ్ AI ఆర్కిటెక్ట్ పోస్టులకు రూ.90 లక్షల వరకు వార్షిక ప్యాకేజీ ప్రకటించింది. ఈ గరిష్ఠ ప్యాకేజీలు CTC మాత్రమే.. చేతికి వచ్చే జీతం కాదు.

ఆరు పోస్టులు.. ఎవరెవరిని నియమించనున్నారు?

ఈ నోటిఫికేషన్‌లో మొత్తం ఆరు పోస్టులను భర్తీ చేయనున్నారు. జనరల్ మేనేజర్ అండ్ చీఫ్ AI ఆఫీసర్ పోస్టు ఒకటి, DGM విభాగంలో మూడు పోస్టులు ఉన్నాయి. వీటిలో రిస్క్ అండ్ ఆపరేషనల్ అనలిటిక్స్, AI గవర్నెన్స్ అండ్ కంప్లయన్స్, డేటా ఇంజినీరింగ్, మోడల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ అండ్ AI ఆప్స్ విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు AI సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్‌ప్రైజ్ AI ఆర్కిటెక్ట్ పోస్టులు ఒక్కొక్కటి ఉన్నాయి. చీఫ్ AI ఆఫీసర్‌గా ఎంపికైన వ్యక్తి బ్యాంకు కోసం AI వ్యూహాలను రూపొందించి అమలు చేయాలి. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, జనరేటివ్ AI, ఏజెంటిక్ AI వంటి టెక్నాలజీలు బ్యాంకింగ్ సేవల్లో ఉపయోగించేలా చూడాలి. రుణాల మంజూరు, మోసాల గుర్తింపు, రిస్క్ అంచనా, కస్టమర్ సేవలు, బ్యాంకు కార్యకలాపాల సామర్థ్యం పెంచడం వంటి అంశాల్లో AI వినియోగానికి నాయకత్వం వహించాలి.

15 ఏళ్ల అనుభవం తప్పనిసరి

చీఫ్ AI ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయసు 2026 సెప్టెంబర్ 30 నాటికి 40 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ విభాగాల్లో BE, BTech, MTech లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి. అలాగే స్టాటిస్టిక్స్ లేదా కంప్యూటర్ సైన్స్‌లో MSc, స్టాటిస్టిక్స్‌లో MA, M.Stat, MCA చదివినవారు కూడా అర్హులు. ఎస్‌బీఐ తర్వాత విడుదల చేసిన సవరణ ప్రకారం ఎకనామిక్స్‌లో MSc లేదా MA చదివినవారిని కూడా ఈ అర్హతల్లో చేర్చింది. విద్యార్హతతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు లేదా ఐటీ రంగంలో కనీసం 15 ఏళ్ల అనుభవం అవసరం. ఇందులో కనీసం మూడేళ్లు AI, అనలిటిక్స్, మోడల్ పర్యవేక్షణ, పాలసీల రూపకల్పన, వ్యాపార మార్పుల అమలులో సీనియర్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించి ఉండాలి.

DGM, AI ఆర్కిటెక్ట్ పోస్టులకు అర్హతలు.. ఎంపిక విధానం

DGM పోస్టులకు 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. సంబంధిత విద్యార్హతతో పాటు బ్యాంకింగ్, ఆర్థిక సేవలు లేదా ఐటీ రంగంలో కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి. ఇందులో కనీసం రెండేళ్లు సంబంధిత విభాగంలో సీనియర్ నాయకత్వ బాధ్యతలు నిర్వహించి ఉండాలి. AI సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఎంటర్‌ప్రైజ్ AI ఆర్కిటెక్ట్ పోస్టులకు 30 నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్నవారు అర్హులు. సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీతో పాటు కనీసం ఎనిమిదేళ్ల పని అనుభవం అవసరం. ఇందులో కనీసం మూడేళ్లు AI, డేటా లేదా టెక్నాలజీ ఆర్కిటెక్చర్‌కు సంబంధించిన పనుల్లో ఉండాలి. ఈ పోస్టుల ఎంపికలో మొదట అభ్…

Tags: