SIP : మ్యాజిక్.. నెలకు రూ.2,000 కడితే.. రూ.5 కోట్ల లాభం.. ఏంటి అవాక్కయ్యారా ?
ఏంటి అవాక్కయ్యారా ?
SIP : సరైన చోట, సరైన సమయంలో చేసే చిన్న పెట్టుబడులు కూడా భవిష్యత్తులో భారీ సంపదను సృష్టిస్తాయి. గత కొన్ని సంవత్సరాలుగా మ్యూచువల్ ఫండ్స్, షేర్ మార్కెట్లు మంచి వృద్ధిని సాధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలిక పెట్టుబడికి చాలా అనుకూలమైనవిగా నిరూపితమయ్యాయి. దాదాపు 30 సంవత్సరాల దీర్ఘకాలిక పెట్టుబడిని పరిశీలిస్తే చాలా మ్యూచువల్ ఫండ్స్ సగటున 12% CAGR లాభాన్ని ఇచ్చాయి. అయితే, కొన్ని ఫండ్స్ మాత్రం సూపర్ స్టార్ ప్రదర్శన కనబరిచాయి.
సూపర్ స్టార్ ఫండ్స్‌లో ఒకటిగా నిలిచిన నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ గత 30 సంవత్సరాల కాలంలో ఏకంగా 22.5% CAGR రేటుతో లాభాలను అందించింది. 22% CAGR అనేది చాలా అసాధారణమైన వృద్ధి రేటు, ఇది చిన్న మొత్తంలో చేసిన పెట్టుబడిని కూడా భారీగా పెంచే సామర్థ్యం కలిగి ఉంటుంది.
ఒకవేళ 30 సంవత్సరాల క్రితం ఎవరైనా ఈ నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్‌లో నెలకు కేవలం రూ.2,000 చొప్పున SIP ప్రారంభించి ఉంటే, వారికి నేడు రూ.5 కోట్ల విలువైన రిటర్న్ లభించేది. 30 ఏళ్లలో వారు కట్టిన మొత్తం కేవలం రూ.7.2 లక్షలు మాత్రమే కాగా, దానికి బదులుగా ఏకంగా రూ.5 కోట్ల లాభం పొందడం చాలా గొప్ప విషయం.
ఒకవేళ, 30 సంవత్సరాల క్రితం ఇదే నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్‌లో మీరు నెలకు రూ.10,000 చొప్పున SIP ప్రారంభించి ఉంటే, రిటర్న్ ఇంకెంత అద్భుతంగా ఉండేదో ఊహించండి. 30 ఏళ్లలో మీరు కట్టిన మొత్తం రూ.36 లక్షలు అయ్యేది. 22.50% CAGR రేటుతో ఫండ్ పెరగడం వలన, మీ పెట్టుబడి విలువ నేటికి దాదాపు రూ.43 కోట్లకు చేరేది!
నిప్పాన్ ఇండియా గ్రోత్ మిడ్ క్యాప్ ఫండ్ గురించి కొన్ని ముఖ్య వివరాలు తెలుసుకుందాం. ఈ ఫండ్ 1995 అక్టోబర్ 8న ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ ఫండ్‌లో రూ.41,268 కోట్లు నిర్వహణలో ఉన్నాయి.
ఎక్స్‌పెన్స్ రేషియో:
రెగ్యులర్ ప్లాన్: 1.54%
డైరెక్ట్ ప్లాన్: 0.74%
ఎగ్జిట్ లోడ్: 1%
ఈ ఫండ్ ప్రధానంగా ఆటోమొబైల్, బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్, ఫార్మా, బయోటెక్ వంటి రంగాలలోని కంపెనీలలో పెట్టుబడి పెడుతుంది. ఈ ఫండ్ మేనేజర్లు భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశం ఉన్న కంపెనీలను ముందుగానే గుర్తించడంలో నిరంతరం నైపుణ్యం చూపిస్తూ వస్తున్నారు.