Cooking Oil Scam : వంట నూనె ప్యాకెట్ల మాయాజాలం..కస్టమర్లను మంచుతున్న కంపెనీలు
Cooking Oil Scam : మీరు ఎప్పుడైనా గమనించారా? మార్కెట్‌లో లభించే వంట నూనె ప్యాకెట్లు చూడడానికి ఒక లీటరు లేదా అర లీటరు ప్యాకెట్లలాగే కనిపిస్తాయి.
Cooking Oil Scam : మీరు ఎప్పుడైనా గమనించారా? మార్కెట్‌లో లభించే వంట నూనె ప్యాకెట్లు చూడడానికి ఒక లీటరు లేదా అర లీటరు ప్యాకెట్లలాగే కనిపిస్తాయి. కానీ, వాటిని జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ ప్యాకెట్లలో ఉండే నూనె పరిమాణం (తూకం) చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు.. ఒక లీటరు ప్యాకెట్‌లా కనిపించే నూనెలో కేవలం 750 గ్రాముల నుంచి 950 గ్రాములు మాత్రమే ఉండవచ్చు. వంట నూనె కంపెనీలు ఇలా వేర్వేరు తూకాలతో ప్యాక్ చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించి, ఎక్కువ లాభాలు పొందుతున్నాయని తెలుస్తోంది. ఈ మోసాన్ని అరికట్టడానికి, లీటరు లెక్కన మాత్రమే నూనెను ప్యాక్ చేయాలని ఈ పరిశ్రమకు చెందిన ఓ ప్రముఖ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది.
వంట నూనె ప్యాకెట్లను గమనిస్తే, వాటి పరిమాణం చూసి చాలా మంది వినియోగదారులు మోసపోతున్నారు. నూనె కంపెనీలు ఈ ప్యాకెట్లను ఒక లీటరు లేదా అర లీటరు పరిమాణంలో కనిపించేలా డిజైన్ చేస్తున్నాయి. ఉదాహరణకు, ఒక లీటరు ప్యాకెట్ లాగా కనిపించే నూనెలో వాస్తవానికి 750 గ్రాముల నుంచి 950 గ్రాముల వరకు మాత్రమే నూనె ఉంటుంది. అదేవిధంగా అర లీటరు ప్యాకెట్‌లో 350 గ్రాముల నుంచి 450 గ్రాముల వరకు ఉండవచ్చు. వంట నూనె కంపెనీలు అధిక లాభాలను పొందడానికి ఈ విధంగా తూకాన్ని తగ్గించే పద్ధతిని అనుసరిస్తున్నాయి.
వివిధ కంపెనీల మధ్య ధరల తగ్గింపు కోసం పోటీ పెరగడంతో, అవి ప్యాకెట్ పరిమాణాన్ని అదే విధంగా ఉంచి, తూకాన్ని తగ్గించే పోటీని ఎంచుకుంటున్నాయి. 810 గ్రాముల తూకం ఉన్న నూనె ప్యాకెట్, 900 గ్రాముల తూకం ఉన్న ప్యాకెట్ కంటే తక్కువ ధరకే లభిస్తుంది. కానీ, రెండూ ఒకే లీటరు ప్యాకెట్ లాగా కనిపించడంతో, వినియోగదారుడు సహజంగా ధర తక్కువ ఉన్న 810 గ్రాముల ప్యాకెట్‌నే కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారు, దీనివల్ల తక్కువ పరిమాణంలో నూనె కొని మోసపోతారు. వంట నూనె పరిశ్రమకు చెందిన ప్రముఖ సంస్థ సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఈ మోసానికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాన్ని కోరింది.
వినియోగదారులను మోసం చేసే ఈ పద్ధతిని నియంత్రించాలని, కంపెనీలు వంట నూనెను తప్పనిసరిగా లీటరు లెక్కన (పరిమాణం లెక్కన) ప్యాక్ చేసేలా నిబంధన తీసుకురావాలని SEA ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాసింది. 800 గ్రాములు, 810 గ్రాములు, 870 గ్రాములు వంటి ఒకేలా లేని నూనె ప్యాకెట్ల సంఖ్య పెరగడం వల్ల కస్టమర్‌లు గందరగోళానికి గురవుతున్నారని SEA తన లేఖలో పేర్కొంది. నూనె ప్యాకెట్లు చూడడానికి ఒకేలా ఉండడం వల్ల, వినియోగదారులు వాటి ధరలను సరిగ్గా పోల్చుకోలేక మోసపోవడానికి ఆస్కారం ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది. లీటర్ల లెక్కన ప్యాకింగ్ తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు.