Savings Account : సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు పెట్టకండి.. తెలియకుండానే నష్టం జరుగుతోంది!

తెలియకుండానే నష్టం జరుగుతోంది!;

Update: 2025-07-09 05:02 GMT

Savings Account : డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, దాన్ని సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా అంతే ముఖ్యం. చాలా మంది తమ కష్టార్జితాన్ని సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంచుతారు. కానీ అలా చేయడం వల్ల మీకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతుంది. మీ డబ్బులను రెట్టింపు చేసుకోవాలంటే ఏం చేయాలో ఈ వార్తలో తెలుసకుందాం. జీవితంలో ధనవంతులు కావాలనుకుంటే బాగా సంపాదిస్తే సరిపోదు. సంపాదించిన డబ్బును సరైన చోట పెట్టుబడి పెట్టడం కూడా చాలా అవసరం. డబ్బును పెట్టుబడి పెట్టడం వల్ల సంపదను సృష్టించడం మాత్రమే కాదు, మీ భవిష్యత్తును కూడా సేఫ్ గా ఉంచుకోగలుగుతారు. చాలా మంది వేర్వేరు మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెడుతుంటారు. అయితే, కొందరు మాత్రం తమ డబ్బును సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంచుతారు. ఇలా చేయడం వల్ల మీకు తెలియకుండానే పెద్ద నష్టం జరుగుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కొంతమంది తమ పొదుపు మొత్తాన్ని నేరుగా సేవింగ్స్ అకౌంట్‌లోనే ఉంచుతారు. కానీ, సేవింగ్స్ అకౌంట్‌లలో చాలా తక్కువ వడ్డీ రేటు లభిస్తుంది. పెద్ద పెద్ద ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు సైతం కేవలం 2.50% నుండి 2.75% మాత్రమే వడ్డీని ఇస్తున్నాయి. ఉదాహరణకు, మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.1 లక్ష ఉంటే, మీకు సంవత్సరానికి రూ.200 నుండి రూ.250 మాత్రమే వడ్డీ వస్తుంది. ఇది చాలా తక్కువ మొత్తం.

మరోవైపు, దేశంలో ద్రవ్యోల్బణం అంటే ధరల పెరుగుదల రేటు దాదాపు 6% ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మీ డబ్బుకు 2.50% లేదా 2.75% వడ్డీ మాత్రమే వస్తే, ద్రవ్యోల్బణాన్ని మించి మీ డబ్బు విలువ పెరగదు. వాస్తవానికి, మీ డబ్బు విలువ సంవత్సరానికి సుమారు 3% తగ్గుతున్నట్లే లెక్క. ఈ పెరుగుతున్న ధరల మధ్య మీ డబ్బును సేవింగ్స్ అకౌంట్‌లో ఉంచడం ఏ మాత్రం తెలివైన పని కాదు.

సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉండాలి?

సేవింగ్స్ అకౌంట్‌లో ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవడానికి వీలుగా కేవలం 3 నుండి 6 నెలల అత్యవసర ఖర్చులకు సరిపడా డబ్బును మాత్రమే ఉంచుకోవాలి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు, లేదా అనుకోని ఖర్చులు వచ్చినప్పుడు వెంటనే ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. మిగిలిన మీ పొదుపు మొత్తాన్ని, అంటే అదనంగా ఉన్న డబ్బును, మీరు కచ్చితంగా మంచి పెట్టుబడి పథకాల్లో ఇన్వెస్ట్ చేయాలి.

డబ్బును సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి కొన్ని మంచి ఆప్షన్లు ఉన్నాయి.

* బ్యాంక్ ఎఫ్‌డీలు : సేవింగ్స్ అకౌంట్ కంటే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లలో మంచి వడ్డీ రేటు లభిస్తుంది. ఇవి సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడతాయి.

* పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ : పోస్ట్ ఆఫీస్ ద్వారా పీపీఎఫ్, ఎంఐఎస్, ఎస్‌సీఎస్ఎస్, కేవీపీ వంటి అనేక చిన్న పొదుపు పథకాలు నడుస్తున్నాయి. వీటిలో పెట్టుబడి పెట్టడం వల్ల మంచి రాబడి పొందవచ్చు. ఇవి కూడా సురక్షితమైన పెట్టుబడి ఎంపికలే.

* మ్యూచువల్ ఫండ్స్ : దీర్ఘకాలిక పెట్టుబడి కోసం మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఇవి మార్కెట్ హెచ్చుతగ్గులకు లోబడి ఉన్నప్పటికీ, నిపుణులైన ఫండ్ మేనేజర్లు మీ డబ్బును వివిధ రంగాల్లో పెట్టుబడి పెట్టి మంచి రాబడిని సాధిస్తారు. సిప్ ద్వారా క్రమం తప్పకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో మీరు గణనీయమైన సంపదను సృష్టించుకోవచ్చు. దీనికోసం మీరు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Tags:    

Similar News