Income Tax Return : ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ ఇండియాలో ఎవరు ఫైల్ చేయనవసరం లేదు ?

ఎవరు ఫైల్ చేయనవసరం లేదు ?;

Update: 2025-07-22 05:26 GMT

Income Tax Return : సాధారణంగా భారతదేశంలో చాలా మంది ఆదాయపు పన్ను చెల్లించకపోయినా ట్యాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో కొందరు వ్యక్తులు, కొన్ని ప్రాంతాల వారికి ఆదాయపు పన్ను నిబంధనల నుండి మినహాయింపు ఉంటుంది. ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన అవసరం లేని వారు ఎవరో ఈ వార్తలో తెలుసుకుందాం.

సిక్కిం రాష్ట్రంలో నివసించే ప్రజలు ఆదాయపు పన్ను కట్టాల్సిన పనిలేదు. భారతదేశంలో సిక్కిం కలిసినప్పుడు, 1950లో వారికి ఈ ప్రత్యేక మినహాయింపు లభించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలలో ఉండే షెడ్యూల్డ్ తెగల వారికి ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అస్సాం, మేఘాలయ, జార్ఖండ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజలు కూడా ఆదాయపు పన్ను చెల్లింపు నుండి మినహాయింపు పొందుతారు.

ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, కొంత ఆదాయం వరకు పన్ను ఉండదు. దీన్నే ప్రాథమిక మినహాయింపు అంటారు. ఇది సాధారణంగా రూ.2.5 లక్షల నుండి రూ.3 లక్షల వరకు ఉంటుంది. 80 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్‌లకు ఈ పరిమితి రూ.5 లక్షలు. ఈ పరిమితిలోపు ఆదాయం ఉన్నవారు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. అలాగూ వయసు 75 ఏళ్లు దాటి, కేవలం పెన్షన్, బ్యాంక్ వడ్డీ ద్వారా మాత్రమే ఆదాయం వస్తుంటే ఐటీ రిటర్న్ దాఖలు చేయనవసరం లేదు.

వ్యవసాయం నుండి మాత్రమే సంపాదన ఉన్నవారు ఐటీఆర్ ఫైల్ చేయాల్సిన పనిలేదు. ఒకవేళ వ్యవసాయంతో పాటు ఇతర మార్గాల నుండి వచ్చే ఆదాయం సంవత్సరానికి రూ.2.5 లక్షలు మించితే, అప్పుడు ఐటీ రిటర్న్ దాఖలు చేయాల్సి ఉంటుంది. NRIలు భారతదేశంలో రూ.2.5 లక్షల కంటే ఎక్కువ ఆదాయం సంపాదిస్తే ఐటీఆర్ ఫైల్ చేయాలి. అంతకంటే తక్కువ ఆదాయం ఉంటే అవసరం లేదు.

కొన్ని రకాల ఆదాయాలపై పన్ను ఉండదు. అలాంటి ఆదాయం మాత్రమే మీకు వస్తుంటే, మీరు ఐటీఆర్ ఫైల్ చేయనవసరం లేదు. ఉదాహరణకు, మ్యూచువల్ ఫండ్స్ నుండి వచ్చే లాభాలు, పీపీఎఫ్ వడ్డీ, బంధువుల నుండి వచ్చే బహుమతులు వంటివి పన్ను లేని ఆదాయాలు.

Tags:    

Similar News