1980s Stars Reunion: 1980s స్టార్స్ రీ యూనియన్..తారలంతా ఒకే చోట

తారలంతా ఒకే చోట

Update: 2025-10-06 05:26 GMT

1980s Stars Reunion: దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన 1980వ దశకపు నటీనటుల వార్షిక "స్టార్స్ రీ-యూనియన్ అక్టోబర్ 4న ఈ సారి చెన్నైలో జరిగింది. ప్రతి సంవత్సరం ఒక వేదికపై జరుగుతున్న స్నేహపూర్వక కలయిక. ఈసారి రీయూనియన్‌ను చెన్నైలోని రాజ్‌కుమార్ సేతుపతి, శ్రీప్రియ తమ సొంత నివాసంలో నిర్వహించారు. మూడేళ్ల విరామం తర్వాత మళ్లీ రీయూనియన్ వేడుక జరుపుకున్నారు.

తెలుగు నుంచి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ (టాలీవుడ్), జయసుధ, సుమలత, నరేష్. తమిళం, మలయాళం, కన్నడ నుంచి ప్రభు, శరత్‌కుమార్, రహమాన్, శోభన, రేవతి, రాధా, నదియా, ఖుష్బూ, సుహాసిని మణిరత్నం, రమ్యకృష్ణన్, లిస్సీ, మీనా, పోర్ణిమ భాగ్యరాజ్, బాలీవుడ్ నుంచి జాకీ ష్రాఫ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. లిస్సీ లక్ష్మి, పోర్ణిమ భాగ్యరాజ్, ఖుష్బూ సుందర్, సుహాసిని మణిరత్నం ఈ కార్యక్రమాన్ని కో ఆర్డినేట్ చేశారు. ఈసారి రీయూనియన్ అట్టహాసంగా కాకుండా, స్నేహం, ఐక్యత , సహృదయాన్ని చాటిచెప్పే విధంగా నిరాడంబరంగా జరిగింది.

రీయూనియన్ సంప్రదాయాన్ని మొదట 2009లో నటీమణులు సుహాసిని మణిరత్నం,లిస్సీ ప్రారంభించారు.1980వ దశకంలో సౌత్ ఇండియా సినీ పరిశ్రమలో పనిచేసిన నటీనటులు అందరూ ఒకే వేదికపైకి వచ్చి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవడం, వారి మధ్య స్నేహబంధాన్ని పంచుకోవడం ఈ రీయూనియన్ ముఖ్య లక్ష్యం.ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన డ్రెస్ కోడ్ లేదా థీమ్‌ను పాటిస్తారు. ఈసారి రీయూనియన్‌లో నటీనటులు చీతా థీమ్‌ డ్రెస్‌ను ధరించారు. గతంలో వారు నలుపు- బంగారు, డెనిమ్ వంటి రంగుల కోడ్‌లను అనుసరించారు.ఈ రీయూనియన్‌లో పాల్గొన్న తారలు తమ అప్పటి అనుభవాలను పంచుకుంటూ, సరదాగా గడుపుతూ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Tags:    

Similar News