Grand ‘Virosh’ Wedding: అదిరిపోయిన 'విరోష్' వెడ్డింగ్ విందు!

'విరోష్' వెడ్డింగ్ విందు!

Update: 2026-02-26 08:56 GMT

Grand ‘Virosh’ Wedding: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది వారిద్దరి సంప్రదాయాలకు అద్దం పట్టే విందు భోజనం. తెలంగాణ ఘాటును, కర్ణాటక రుచులను మేళవించి అతిథులకు ఒక అద్భుతమైన అనుభూతిని అందించారు. ముఖ్యంగా తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, నోరూరించే హైదరాబాద్ దమ్ బిర్యానీ విందులో ప్రధాన వంటకాలుగా నిలిచాయి. మాంసాహార ప్రియుల కోసం పక్కా పల్లెటూరి స్టైల్‌లో నాటుకోడి పులుసు, కరకరలాడే గారెలను సిద్ధం చేశారు. వీటితో పాటు పాతబస్తీకి చెందిన ప్రసిద్ధ కీమా సమోసాలు, పప్పు, పచ్చిపులుసు వంటి వంటకాలు విందులో ప్రత్యేక రుచిని అద్దాయి.

మరోవైపు రష్మిక పుట్టినూరు అయిన కర్ణాటకలోని కూర్గ్ ప్రాంతపు ప్రత్యేక వంటకాలను కూడా మెనూలో చేర్చారు. కొడవ సంప్రదాయంలో అత్యంత ఫేమస్ అయిన 'పాండీ కర్రీ' (స్పెషల్ పోర్క్ కర్రీ) ఈ విందులో హైలైట్‌గా నిలిచింది. దీనిని బియ్యం పిండితో చేసిన ప్రత్యేక రొట్టెలతో కలిపి అతిథులకు వడ్డించారు. కర్ణాటక స్పెషల్ వంటకమైన బిసిబేలె బాత్ కూడా అతిథుల మనసు గెలుచుకుంది. విందు ముగింపులో నోటిని తీపి చేసేందుకు నేతితో తయారు చేసిన అసలైన మైసూర్ పాక్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేయించారు. ఇలా తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సంస్కృతులను గౌరవిస్తూ ఏర్పాటు చేసిన ఈ 'విరోష్' వెడ్డింగ్ విందు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News