Allu Arjun Shares an Emotional Post:హ్యాపీకి 20 ఏండ్లు..అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
అల్లు అర్జున్ ఎమోషనల్ పోస్ట్
Allu Arjun Shares an Emotional Post: తెలుగు యువతను ఒక ఊపు ఊపిన చిత్రాల్లో 'హ్యాపీ' ఒకటి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీ కెరీర్లో క్లాసిక్ హిట్ గా నిలిచింది. ఇందులో బన్నీ డ్యాన్స్ కు అభిమానులు ఫిదా అయ్యారు. టి. కరుణాకరన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదలై జనవరి 27తో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ను షేర్ చేస్తూ మధుర జ్ఞాపకాలను పంచుకున్నాడు. నా కెరీర్లో అత్యంత ఆనందాన్ని ఇచ్చిన సినిమాల్లో హ్యాపీ ఒకటి.
అద్భుతమైన విజన్ ఈ కథను తెరకెక్కించిన దర్శకుడు ఎ. కరుణా కరసకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నా సహనటి జెనీలియా, విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పేయ్, అలాగే ఇతర నటీనటులు ఈ సినిమాను నిజంగా ఒక ఆనందకర ప్రయాణంగా మార్చారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టరయువన్ శంకర్ రాజా ప్రాణం పోశారు. సినిమా కోసం కష్టపడ్డ ప్రతి ఒక్క సాంకేతిక నిపుణుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ప్రాజెక్ట్ బలంగా నిలిచిన నా తండ్రి అల్లు అరవింద్ గారు, ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కు స్పెషల్ థాంక్స్ ప్రేక్షకుల ప్రేమ, ఆదరణే ఈ సినిమాను చిరస్మరణీయంగా నిలిపింది' అంటూ ఆనాటి మెమోరీస్ ను గుర్తుచేసు కున్నాడు.