సియంను కలసిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డు గ్రహీతలు

జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి;

Update: 2025-08-19 04:30 GMT

భార‌త దేశంలో సినిమా నిర్మాణానికి కేంద్ర బిందువుగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. 71 వ జాతీయ చలన చిత్ర అవార్డులకు వివిధ విభాగాల్లో ఎంపికైన తెలుగు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీయం రేంత్‌రెడ్డి జాతీయ అవార్డు గ్రహీతలందరినీ శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం సీయం మాట్లాడుతూ సినిమా రంగం అభివృద్ధి చెందడానికి కావాల్సిన ప్రోత్సాహాన్ని ప్రభుత్వం తరపున అందిస్తామని సీయం విస్పష్టమైన హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ రాధానిగా రూపాంతరం చెందడానికి అవసరమైన చేయూతను అందిస్తామ‌ని తెలిపారు.

సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను సినీ ప్రముఖులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లో సినిమా రంగ అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకారం అందిస్తుందని సీయం వారికి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జాతీయ అవార్డు గ్రహీతలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు. అవార్డు గ్రహీతలైన భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హనుమాన్ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్‌ అందించిన వెంకట్, శ్రీనివాస్, టీమ్ సభ్యులు, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబి సినిమా డైరెక్టర్ సాయి రాజేశ్, సింగర్ పీవీఎన్‌ఎస్‌ రోహిత్‌లను సీయం రేవంత్‌రెడ్డి సన్మానించారు. సీయం రేవంత్‌రెడ్డిని కలసిన వారిలో హనుమాన్ సినిమా నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి, బేబి సినిమా నిర్మాత ఎస్కేఎన్, భగవంత్ కేసరి నిర్మాత గారపాటి సాహు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News