హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరు;
భారతీయ సినిమాలో 50 సంవత్సరాల పాటు హీరోగా గుర్తింపు
తెలుగు సినీ హీరో నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. యాభై సంవత్సరాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో యాభై సంవత్సరాలుగా హీరోగా కొనసాగుతున్న రికార్డును సొంతం చేసుకున్నందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే గోల్డ్ ఎడిషన్‌లో నందమూరి బాలకృష్ణ పేరును నమోదు చేశారు. లండన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్ధ యూకే, అమెరికా, కెనడా, స్విట్జర్లండ్, ఇండియా, యుఏఇ వంటి దేశాల్లోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో గుర్తింపు పొందిన సంస్ధ. భారతీయ సినిమా చరిత్రలో ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్న బాలకృష్ణ పేరు ఇప్పుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో నమోదు అవ్వడం తెలుగు సినీ పరిశ్రమకే కాదు భారత చలనచిత్ర పరిశ్రమే గర్వకారణమైన విషయం. ఇటీవలే సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయన్ను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. తాజాగా సుదీర్ఘకాలం 50 సంవత్సరాల పాటు హీరోగా కొనసాగినందుకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లోకి ఎక్కడం ఆయన అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ సంతోష్ శుక్లా హీరో నందమూరి బాలకృష్ణ ఐదు దశాబ్దాల సినిమా సేవలను మిలియన్ల మందికి స్ఫూర్తిగా ప్రశంసించారు. ఇది భారతీయ సినిమాలో గోల్డెన్ బెంచ్‌మార్క్‌ను స్థాపించిన సందర్భమన్నారు. భారతీయ చలన చిత్ర రంగంలో ఒక హీరోగా నందమూరి బాలకృష్ణ అసాధారణ సేవలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, యూకే గోల్డ్ ఎడిషన్‌లో ఆయన పేరు నమోదు చేసిన గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీఈఓ ఆగస్టు 30వ తేదీన హైదరాబాదులో స్వయంగా బాలకృష్ణ ఈ గుర్తింపు పత్రాలను అందజేయనున్నారు.