New Track from ‘Kingdom’ Movie: శత్రువు బెదిరేలా.. కింగ్డమ్ నుంచి కొత్త సాంగ్

కింగ్డమ్ నుంచి కొత్త సాంగ్;

Update: 2025-07-29 08:53 GMT

New Track from ‘Kingdom’ Movie:  విజయ్ దేవరకొండ హీరోగా, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న కింగ్‌డమ్ సినిమా రిలీజ్ టైం దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది టీం. గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ ,ట్రైలర్ రిలీజ్ లు చేసి ఈ సినిమాకు హైప్ తెచ్చింది మూవీ యూనిట్. లేటెస్ట్ గా ఇవాళ రగిలే రగిలే అనే కొత్త సాంగ్ ను రిలీజ్ చేసింది టీం. మృత్యువు జడిసేలా పద పద.. శత్రువు బెదిరేలా అని కృష్ణ కాంత్ రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెస్తున్నాయి. ఈ సాంగ్ తో మరింత హైప్ ను తీసుకొచ్చారు. అనిరుధ్ రవిచందర్ లైవ్ పెర్ఫార్మెన్స్ ద్వారా సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ క్లైమాక్స్‌లో ఉండవచ్చని తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన హృదయం లోపల అనే పాటకు మంచి స్పందన వచ్చింది. అలాగే, విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించిన ఈ సినిమాలో వారి అనుబంధం నేపథ్యంలో అన్నా అంటూనే అనే ఎమోషనల్ పాట కూడా ఆకట్టుకుంది. ఈ సినిమా జూలై 31న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

విజయ్ దేవరకొండకు సరైన బ్లాక్‌బస్టర్ హిట్ అవసరం ఉన్న సమయంలో "కింగ్ డమ్" విడుదలవుతోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం, అనిరుధ్ సంగీతం, విజయ్ కొత్త యాక్షన్ అవతార్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాయి. విడుదలైన ట్రైలర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఈ చిత్రం విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఒక మైలురాయి అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.

Tags:    

Similar News