Actor Dhanush: నేను చెఫ్ కావాలనుకున్నాను.. కానీ.. ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కానీ.. ధనుష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Update: 2025-09-22 07:16 GMT

Actor Dhanush: తాను చిన్నప్పుడు చెఫ్ కావాలని కలలు కన్నానని, కానీ విధి తనను నటుడిగా మార్చిందని తమిళ స్టార్ ధనుష్ వెల్లడించారు. తాను స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న ఇడ్లీ కడై సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో ఆయన ఈ ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. "నాకు ఎందుకో తెలియదు కానీ తరచుగా చెఫ్ పాత్రలే వస్తుంటాయి. నిజానికి నేను వంటవాడిని కావాలని బలంగా కోరుకున్నాను. ఆ కోరిక వల్లేనేమో నాకు ఇలాంటి పాత్రలే దక్కుతున్నాయి. జగమే తందిరంలో పరోటాలు, తిరుచిత్రాంబళంలో ఫుడ్ డెలివరీ బాయ్‌గా కనిపించాను. నా గత చిత్రం రాయన్‌లో ఫాస్ట్ ఫుడ్ షాప్ నడిపాను. ఇప్పుడు ఈ ఇడ్లీ కడై సినిమాలో ఇడ్లీలు వేస్తున్నాను. దీన్నే మ్యానిఫెస్టేషన్ అంటారేమో" అని ధనుష్ నవ్వుతూ అన్నారు.

యువతకు స్ఫూర్తినిచ్చిన ధనుష్

మ్యానిఫెస్టేషన్ శక్తిని వివరిస్తూ.. "మనం ఏదైతే బలంగా ఆలోచిస్తామో అదే అవుతాం. నా జీవితంలో ఇది నిజమని రుజువైంది. యువత తమ లక్ష్యాలను బలంగా నమ్మాలి. తాము అనుకున్నది సాధించడం కోసం కష్టపడాలి. లక్ష్యంపై ధ్యాస పెట్టి శ్రమిస్తే ఎవరైనా ఏదైనా సాధించగలరు" అని యువతకు స్ఫూర్తినిచ్చారు.

ఇడ్లీ కడై విశేషాలు

'ఇడ్లీ కడై' సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎమోషనల్ చిత్రమని, కుటుంబంతో కలిసి చూసి ఆనందించవచ్చని ధనుష్ తెలిపారు. ఇందులో ధనుష్‌తో పాటు నిత్యామీనన్ హీరోయిన్‌గా నటించగా షాలినీ పాండే కీలక పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నటుడు అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 1న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags:    

Similar News