Actor Nagarjuna: నా క్యారెక్టర్ హీరో రేంజ్ లో ఉంటది

హీరో రేంజ్ లో ఉంటది;

Update: 2025-08-05 07:53 GMT

Actor Nagarjuna: హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో 'కూలీ' సినిమా ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో నాగార్జున, దర్శకుడు లోకేశ్ కనగరాజ్, నటి శృతి హాసన్, నటుడు సత్యరాజ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాగార్జున .. ఈ సినిమాలో విలన్‌గా నటించడం ఒక కొత్త అనుభవమని అన్నారు. ఇంతకు ముందు నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ, పూర్తిగా విలన్‌గా నటించడం ఇదే మొదటిసారి అని చెప్పారు. ఈ పాత్రకు 'సైమన్' అనే పేరు ఉంటుందని.. రజనీకాంత్‌కు సమానంగా ఉంటుందని చెప్పారు.

లోకేశ్ పనితీరు, ప్రశాంతత అద్భుతమని నాగార్జున ప్రశంసించారు. ఆయనతో పనిచేయాలనే కోరికతోనే ఈ సినిమాలో నటించానని చెప్పారు. రజనీకాంత్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, ఒక షూటింగ్ సమయంలో రజనీకాంత్ తన కారవాన్‌లోకి వచ్చి ఆహ్వానించిన సందర్భాన్ని పంచుకున్నారు. రజనీకాంత్ చాలా చిన్న వయసులో కనిపించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాచ్ స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందిందని, ఇందులో కథనం చాలా ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

రజినీకాంత్ పాజిటివ్ ఎనర్జీ , ప్రొఫెషనలిజం గురించి శృతి హాసన్ ప్రశంసలు కురిపించారు. రజినీకాంత్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుతమైన అనుభూతి అని తెలిపారు. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని చెప్పింది. ఈ సినిమా ఆగస్టు 14న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

Tags:    

Similar News