Actor Sharwanand: ఇది నాకు ఎమోషనల్ మూమెంట్
ఎమోషనల్ మూమెంట్
Actor Sharwanand: శర్వానంద్ కథానాయకుడిగా, రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన 'నారి నారి నడుమ మురారి' సంక్రాంతి కానుకగా (జనవరి 14న) విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం నిర్వహించిన సక్సెస్ మీట్ లో శర్వానంద్ ఆసక్తికరమైన , ఉద్వేగభరితమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రతి సంక్రాంతికి నేను థియేటర్లోకి రావాలి.. అప్పుడే అన్ని సినిమాలు బాగా ఆడుతాయి" అని శర్వానంద్ చమత్కరించారు.గతంలో తాను నటించిన ఎక్స్‌ప్రెస్ రాజా, శతమానం భవతి సినిమాలు కూడా సంక్రాంతికి విడుదలై పెద్ద విజయాలు సాధించాయని, ఆ సెంటిమెంట్ ఈ సినిమాతో ('హ్యాట్రిక్') కూడా కొనసాగడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
నిర్మాత అనిల్ సుంకర గురించి మాట్లాడుతూ.. "ఏ నిర్మాత కూడా ఇంత ఓపెన్‌గా మాట్లాడటం నేను చూడలేదు. సినిమా రిజల్ట్ గురించి ఆయనకు ఉన్న నమ్మకం నాకు ధైర్యాన్ని ఇచ్చింది" అని ప్రశంసించారు.కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా గర్వంగా ఉందని, ఫ్యామిలీ ఆడియన్సే తన అతిపెద్ద బలమని శర్వానంద్ తెలిపారు. క్లీన్ కామెడీ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ విజయం మరోసారి నిరూపించిందన్నారు.దర్శకుడు రామ్ అబ్బరాజు రాసుకున్న కామెడీ టైమింగ్, స్క్రీన్ ప్లే సినిమా విజయానికి ప్రధాన కారణమని కొనియాడారు.
ఈ సినిమాను పంపిణీ చేసిన దిల్ రాజు మాట్లాడుతూ.. "శతమానం భవతి తర్వాత శర్వా మరోసారి సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఓటీటీల కాలంలో కూడా ఇలాంటి సినిమాలకు థియేటర్లలో జనం రావడం గొప్ప విషయం" అని అన్నారు.ఈ సినిమాలో నటించిన సీనియర్ నరేష్ మాట్లాడుతూ.. తన కెరీర్‌లో ఇది మరో బెస్ట్ రోల్ అని, ప్రేక్షకులు తనను 'నరేష్ 3.0' వెర్షన్‌లో చూస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమాలో సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. సంక్రాంతి రేసులో 'అనగనగా ఒక రాజు' (నవీన్ పోలిశెట్టి), 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (రవితేజ) వంటి సినిమాలతో పోటీ పడి ఈ చిత్రం మంచి వసూళ్లను సాధిస్తోంది.