Actress Aishwarya Rajesh: ఓ.! సుకుమారి’లో నా పాత్ర ముట్టుకుంటే షాక్ కొడుతుంది

షాక్ కొడుతుంది

Update: 2026-07-17 05:45 GMT

Actress Aishwarya Rajesh: వైవిధ్యమైన నటనతో తెలుగు, తమిళ ప్రేక్షకుల మనసు గెలుచుకున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్, వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘ఓ.! సుకుమారి’. భరత్ దర్శన్ దర్శకత్వంలో, మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ క్యూట్ విలేజ్ లవ్ స్టోరీ జులై 17న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమాలో తాను చేసిన ‘దామిని’ పాత్ర చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుందని ఐశ్వర్య రాజేష్ చెప్పారు. ఈ క్యారెక్టర్‌కు ఒక వింతైన, వినూత్నమైన క్యారెక్టరైజేషన్ ఉంటుందని.. తన పాత్రను ముట్టుకుంటే ఎదుటివారికి కరెంట్ షాక్ కొడుతుందని ఆమె నవ్వుతూ వెల్లడించారు. ఈ వింత ప్రయాణాన్ని, దామిని పాత్రను థియేటర్లలో ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇక కథ విషయానికి వస్తే.. ఇందులో హీరో తిరువీర్ కార్పొరేటర్ కావాలని కలలు కనే ఒక పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారని ఐశ్వర్య తెలిపారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు, "ఎవరికి ముందు కొడుకు పుడితే వారికే ఆస్తి" అనే తండ్రి కండిషన్ చుట్టూ కథ తిరుగుతుందని హింట్ ఇచ్చారు. సరిగ్గా అదే సమయంలో దామిని ఎంట్రీ ఇవ్వడం.. వారి మధ్య సాగే ప్రేమకథ, ఆ తర్వాత జరిగే పెళ్లి సీన్స్ ఆడియెన్స్‌ను ఫుల్‌గా ఎంగేజ్ చేస్తాయని స్పష్టం చేశారు.

నిర్మాత మహేశ్వర్ రెడ్డి ఎప్పుడూ కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తారని, ఈ చిత్రం ఆయనకు పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకున్నారు. తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెబుతూ.. ప్రస్తుతం సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లు కూడా చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు తాను నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయలేదని.. భవిష్యత్తులో ‘నరసింహా’ సినిమాలో రమ్యకృష్ణ చేసిన ‘నీలాంబరి’ తరహా పవర్‌ఫుల్ నెగెటివ్ రోల్స్, అలాగే మైండ్ గేమ్ తరహా ‘అబ్సెషన్’ పాత్రల్లో నటించాలని ఉందంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Tags:    

Similar News