Actress Ameesha Patel: కుర్రాళ్లు డేటింగ్‌కు పిలుస్తున్నారు..నచ్చితే వెళ్తా

నచ్చితే వెళ్తా

Update: 2025-11-18 06:09 GMT

Actress Ameesha Patel: నటి అమీషా పటేల్ తన పెళ్లి గురించి, డేటింగ్ గురించి, బాలీవుడ్ పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. "నా వయసులో సగం ఉన్న కుర్రాళ్లు కూడా నన్ను డేటింగ్‌కు పిలుస్తున్నారు. ఈ విషయంలో నేను చాలా ఓపెన్‌గా ఉన్నాను. వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. మానసిక పరిపక్వత, అనుకూలత ఉంటే, ఎవరినైనా ఎంచుకోవడానికి నేను రెడీ," అని ఆమె పేర్కొన్నారు.తాను ఇప్పటికీ పెళ్లి చేసుకోకపోవడానికి గల కారణాన్ని కూడా ఆమె వివరించారు. "చాలామంది హీరోయిన్లు పెళ్లి చేసుకొని కెరీర్‌ను వదిలేస్తుంటారు. కానీ, నేను ప్రేమ కన్నా కెరీర్ గొప్పదని భావించాను, అందుకే ప్రేమను వదిలేశాను. నాకు తగినవాడు దొరికినప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను," అని తెలిపారు.

చాడీలు చెప్పను

"నేను ఏ బాలీవుడ్ క్యాంపులకు (గ్రూపులకు) చెందను. నేను డ్రింక్ చేయను, స్మోక్ చేయను, పని కోసం 'మస్కా లగావ్‌' (చాడీలు లేదా పొగడ్తలు) చేయను. అందుకే ఇండస్ట్రీ లోపలి వ్యక్తులు నన్ను ఇష్టపడరు. నాకు నా ప్రతిభ ఆధారంగా మాత్రమే అవకాశాలు వస్తాయి," అని ఆమె అన్నారు.పాపాత్రల కోసం రాజీపడే క్యారెక్టర్ తనది కాదని, అందుకే తాను చాలా అవకాశాలను కోల్పోయానని పరోక్షంగా నెపోటిజం, ఫేవరెటిజం గురించి వ్యాఖ్యానించారు."ఇండస్ట్రీకి చెందిన బాయ్‌ఫ్రెండ్‌ లేదా భర్త లేకపోతే ఔట్‌సైడర్‌గా ఇక్కడ నిలదొక్కుకోవడం కష్టం," అని కూడా ఆమె అభిప్రాయపడ్డారు.

Tags:    

Similar News