Actress Karate Kalyani: బిగ్‌బాస్‌పై సీనియర్ నటి సంచలన కామెంట్స్..

సీనియర్ నటి సంచలన కామెంట్స్..

Update: 2025-12-11 14:33 GMT

Actress Karate Kalyani: తెలుగులో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ప్రముఖ నటి కరాటే కల్యాణి సంచలన ఆరోపణలు చేశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ షోలో పాల్గొనడం వల్ల తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, తన సినీ కెరీర్‌కు తీవ్ర ఆటంకం కలిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. "నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల లాభం కంటే రెండింతలు నష్టపోయాను. అక్కడ సంపాదించిన దానికన్నా ఎక్కువే పోగొట్టుకున్నాను. ఆ షో అగ్రిమెంట్ కారణంగా నాకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలు లేవు, అవకాశాలు లేవు. షోకు వెళ్తే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. కానీ బయటకు వచ్చాక నన్ను ఎవరూ పట్టించుకోలేదు. బిగ్‌బాస్ షో వల్లే నేను ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సి వచ్చింది" అని కల్యాణి తెలిపారు.

సాధారణంగా పాప్యులారిటీ మరియు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టే బిగ్‌బాస్ షోపై ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కొందరు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తూ, నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు ఆసక్తితో వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

Tags:    

Similar News