Actress Lakshmi Menon: కిడ్నాప్ కేసులో హీరోయిన్ లక్ష్మీ మీనన్..హైకోర్టులో ఊరట
హైకోర్టులో ఊరట;
Actress Lakshmi Menon: మలయాళ నటి లక్ష్మీ మీనన్ కొచ్చిలో ఒక ఐటీ ఉద్యోగి కిడ్నాప్, దాడి కేసులో నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు నమోదు అయినప్పటి నుంచి ఆమె పరారీలో ఉన్నారని, పోలీసులు ఆమె కోసం గాలిస్తున్నారని సమాచారం.
తాజాగా లక్ష్మీ మీనన్ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ఆమెను అరెస్ట్ చేయకుండా సెప్టెంబర్ 17 వరకు స్టే విధించింది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.
కొచ్చిలోని ఒక బార్‌లో జరిగిన గొడవ అనంతరం, లక్ష్మీ మీనన్, ఆమె స్నేహితులు ఒక ఐటీ ఉద్యోగిని వెంబడించి, అతని కారును అడ్డగించి దాడి చేసి కిడ్నాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, ప్రధాన నిందితురాలుగా ఉన్న లక్ష్మీ మీనన్ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.లక్ష్మీ మీనన్ కూడా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.