Actress Regina Cassandra: సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న రెజీనా
20 ఏళ్లు పూర్తి చేసుకున్న రెజీనా;
Actress Regina Cassandra: అందం, అభినయం ఉన్న నటి రెజీనా కసండ్రా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయ్యాయి. రెజీనా తన నట జీవితాన్ని 2005లో తమిళ చిత్రం కంద నాళ్ ముదల్ తో ప్రారంభించారు. అప్పటికి ఆమె వయసు దాదాపు 14-15 సంవత్సరాలు మాత్రమే.
తెలుగులో ఆమెకు బ్రేక్ ఇచ్చిన సినిమా 2012లో వచ్చిన 'శివ మనసులో శ్రుతి'. ఈ చిత్రానికి గాను ఆమె SIIMA అవార్డు ఫర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ - తెలుగు అవార్డును గెలుచుకున్నారు. కొత్తజంట, పిల్లా నువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించిన ఆమె ..ఎవరూ శాకిని డాకినీ అనే డిఫరెంట్ రోల్ క్యారెక్టర్ చేశారు. పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తున్నారు. అపుడపుడు పలు టీవీ షోల్లో జడ్జిగా కూడా చేస్తున్నారు రెజీనా
కేవలం తెలుగు, తమిళం మాత్రమే కాకుండా కన్నడ, హిందీ భాషల్లో కూడా ఆమె సినిమాలు చేశారు. 'రాకెట్ బాయ్స్' వంటి ఓటీటీ ప్రాజెక్ట్‌లతో కూడా గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాలు చేసి, ఆ తర్వాత చదువు కోసం కొంతకాలం విరామం తీసుకున్నారు. మళ్లీ 2012 నుంచి వరుసగా సినిమాలు చేస్తూ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె అనేక ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఇస్తూ పలు పాత్రలను ఎంచుకుంటున్నానని చెప్పారు రెజీనా. చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి, 20 ఏళ్లుగా వివిధ భాషల్లో నటిగా కొనసాగడం ఒక గొప్ప మైలురాయి అని ఆమె అభిప్రాయపడ్డారు.