Actress Tanya Ravichandran: సినిమాటోగ్రాఫర్ తో హీరోయిన్ ఎంగేజ్ మెంట్.. త్వరలో పెళ్లి!
త్వరలో పెళ్లి!;
By : PolitEnt Media
Update: 2025-07-17 05:49 GMT
Actress Tanya Ravichandran: నటి తాన్య రవిచంద్రన్ ఎంగేజ్‌మెంట్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గౌతమ్ జార్జ్తో జరిగింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆమెకు అభిమానులు, సినిమా సెలెబ్రిటీలు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
తాన్య తెలుగులో "రాజా విక్రమార్క", చిరంజీవి "గాడ్ ఫాదర్" సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. గౌతమ్ జార్జ్ ప్రస్తుతం రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్న "బెంజ్" చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.
ఈ జంట తమ ఎంగేజ్‌మెంట్ ఫోటోను (లిప్ కిస్ చేస్తున్నట్లు) సోషల్ మీడియాలో షేర్ చేయగా, సినీ ప్రముఖులు, అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. వివాహ తేదీ వివరాలు ఇంకా వెల్లడించలేదు.