Aamir Khan Gives Clarity: 15 ఏళ్ల తర్వాత ‘త్రీ ఇడియట్స్’ .క్లారిటీ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్
క్లారిటీ ఇచ్చిన మిస్టర్ పర్ఫెక్ట్
Aamir Khan Gives Clarity: భారతీయ చలనచిత్ర రంగాన్ని ఒక ఊపు ఊపేసిన సినిమా ‘త్రీ ఇడియట్స్’. అమీర్ ఖాన్, శర్మన్ జోషి, మాధవన్.. ఈ ముగ్గురి స్నేహం, చదువుల ఒత్తిడిపై వారు చేసిన పోరాటం ప్రతి ఒక్కరినీ నవ్వించింది, ఆలోచింపజేసింది. 2009లో విడుదలైన ఈ వండర్ మ్యాజిక్ ఇప్పుడు మళ్ళీ రీ-క్రియేట్ కాబోతోంది. . ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ‘త్రీ ఇడియట్స్’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైంది.
ఈ ప్రాజెక్ట్‌పై తాజాగా మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ స్వయంగా స్పందించారు. దర్శకుడు రాజ్‌కుమార్ హిరానీ ప్రస్తుతం ‘3 ఇడియట్స్ 2’ పనుల్లో బిజీగా ఉన్నారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తాను స్టోరీ లైన్ విన్నానని, అది చాలా అద్భుతంగా ఉందని అమీర్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం స్క్రీన్‌ప్లేపై కసరత్తులు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.
మరి ఈ సీక్వెల్ కథ దేని గురించి? మొదటి పార్ట్‌లో ఉన్న అదే కామెడీ, ఎమోషన్ ఇందులోనూ కొనసాగుతాయని అమీర్ చెప్పారు. అయితే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే.. ‘త్రీ ఇడియట్స్’ ముగిసిన 10 ఏళ్ల తర్వాత ఆ పాత్రల జీవితాల్లో ఏం జరిగింది? రాంచో, ఫర్హాన్, రాజుల లైఫ్ ఎలా మారింది? అనే విభిన్నమైన పాయింట్‌తో హిరానీ ఈ కథను సిద్ధం చేస్తున్నారట.
రాజ్‌కుమార్ హిరానీ - అమీర్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘త్రీ ఇడియట్స్’, ‘పీకే’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఇప్పుడు వీరిద్దరూ కలిసి మరోసారి మ్యాజిక్ చేయడానికి రెడీ అవుతున్నారు.