NTR's Dragon: 46 ఏళ్ల తర్వాత తెలుగులోకి..ఎన్టీఆర్ డ్రాగన్ లో అనిల్ కపూర్..!

ఎన్టీఆర్ డ్రాగన్ లో అనిల్ కపూర్..!;

Update: 2025-08-30 13:23 GMT

NTR's Dragon: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలోకి బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పెట్టనున్నారని టాక్.

ఇదే నిజమైతే దాదాపు 46 ఏళ్ల తర్వాత అనిల్ కపూర్ తెలుగు చిత్రసీమలోకి తిరిగి అడుగుపెట్టినట్టే. బాలీవుడ్ లో అగ్ర నటుడిగా ఎదగకముందు ఆయన 1980లో వచ్చిన తెలుగు చిత్రం 'వంశ వృక్షం'లో నటించారు. యానిమల్' చిత్రంలో తన నటనతో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అనిల్ కపూర్, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగమైతే సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.

ఇటీవల రిలీజ్ అయిన హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 లో అనిల్ కపూర్ కలిసి నటించారు. ఇపుడు మరోసారి ఇద్దరు కలిసి నటించడం ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News