Aishwarya Bows at PM Modi’s Feet and Seeks His Blessings: ప్రధాని మోదీ కాళ్లు మొక్కి.. ఆశీర్వాదం తీసుకున్న ఐశ్వర్య

ఆశీర్వాదం తీసుకున్న ఐశ్వర్య

Update: 2025-11-20 05:53 GMT

Aishwarya Bows at PM Modi’s Feet and Seeks His Blessings: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాలు మొక్కిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శ్రీ సత్య సాయిబాబా గారి శత జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తిలో జరిగింది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఐశ్వర్య రాయ్ బచ్చన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ ఒక భావోద్వేగపూరితమైన ప్రసంగం చేసిన తర్వాత, వేదికపై ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి, వంగి ఆయన కాళ్ళకు నమస్కరించి, ఆశీర్వాదం తీసుకున్నారు.ప్రధాని మోదీ వెంటనే చేయి చాచి ఆమెను ఆశీర్వదించి నమస్కారం చేశారు.

ఈ ఘటన మీడియా, సోషల్ మీడియాలో విపరీతంగా ప్రసారమైంది. ప్రముఖులకు, పెద్దలకు గౌరవం ఇవ్వడంలో భాగంగా ఐశ్వర్య చూపిన సంప్రదాయ మర్యాదగా దీనిని పలువురు ప్రశంసించారు. ఐశ్వర్య రాయ్, సత్య సాయిబాబా స్థాపించిన 'బాల వికాస్' కార్యక్రమంలో విద్యార్థిగా ఉన్న తన బాల్య అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

ఒకే ఒక్క కులం ఉంది, అది మానవత్వం.ఒకే ఒక్క మతం ఉంది, అది ప్రేమ.ఒకే ఒక్క భాష ఉంది, అది హృదయ భాష.ఒకే ఒక్క దేవుడు ఉన్నాడు, ఆయన సర్వాంతర్యామి అని ఐశ్వర్య సత్యసాయి బోధనలను గుర్తు చేసుకున్నారు.సత్యసాయి జన్మించి వందేళ్లు గడిచినా బాబా లక్షలాది మంది గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఐశ్వర్య రాయ్ అన్నారు.

Tags:    

Similar News