Akhanda 2: అఖండ 2 డబ్బింగ్ కంప్లీట్..రిలీజ్ ఎపుడంటే.?
రిలీజ్ ఎపుడంటే.?;
Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2' సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ అధికారికంగా ప్రకటించింది.ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో రీ-రికార్డింగ్, విజువల్ ఎఫెక్ట్స్ వంటి పనులు ఉన్నాయి. సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు మరోసారి స్పష్టం చేశారు.
బాలకృష్ణతో పాటు ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్, జగపతిబాబు, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా, సంజయ్ దత్ వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అఖండ 2' బాలకృష్ణకు మొదటి పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. హిందీలో 'అఖండ' డబ్బింగ్ వెర్షన్ మంచి విజయం సాధించడంతో, ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
ఇప్పటికే తాండవం పేరుతో విడుదలైన విడుదలైన అఖండ 2' సినిమా టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. టీజర్లో హిమాలయాల్లో శివభక్తుడిగా బాలకృష్ణ కనిపించడం, శక్తివంతమైన డైలాగులు, ఎస్. థమన్ అందించిన నేపథ్య సంగీతం అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
నా శివుడి అనుమతి లేకుండా ఆ యముడైన కన్నెత్తి చూడడు... నువ్వు చూస్తావా?" అనే డైలాగ్‌కు మంచి స్పందన లభించింది. ఎస్. థమన్ అందించిన సంగీతం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.