Akhanda 2: అఖండ 2 టికెట్ల రేట్లు భారీగా పెంపు..
టికెట్ల రేట్లు భారీగా పెంపు..
Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం' సినిమా టికెట్ ధరల పెంపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.'అఖండ 2' డిసెంబర్ 5న విడుదల కానున్న నేపథ్యంలో, ప్రభుత్వం ప్రత్యేక అనుమతులను జారీ చేసింది. విడుదలైన తేది నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు రూ.75 , మల్టీప్లెక్స్‌లలో రూ.100, ప్రీమియర్ షోలకు డిసెంబరు 4న రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించింది. ఈ ప్రీమియర్ టికెట్ ధరను ఏకంగా రూ.600 (జీఎస్టీతో కలిపి)గా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు అనుమతి ఇచ్చింది
ఈ ప్రత్యేక అనుమతులు సినిమాకు భారీ ఓపెనింగ్స్, వసూళ్లను సాధించడానికి దోహదపడతాయి.తెలంగాణలో కూడా టికెట్ ధరల పెంపు లేదా ప్రీమియర్ షోల నిర్వహణపై అధికారిక జీవో రావాల్సి ఉంది. అయితే, ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి తెలంగాణలో కూడా కొంతవరకు ధరల పెంపునకు అనుమతులు లభించే అవకాశం ఉంది.
ఇది 2021లో వచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్.ఈ సినిమా దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కినట్లు సమాచారం.తొలి భాగంలో అఘోరా పాత్రకు లభించిన అద్భుతమైన స్పందన కారణంగా, ఈ భాగంలో అఘోరా పాత్ర యొక్క నేపథ్యం, అతీత శక్తులు , దాని చుట్టూ ఉన్న రహస్యాలను మరింత లోతుగా చూపించనున్నారు. బోయపాటి మార్క్ భారీ యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌లు, ముఖ్యంగా బాలకృష్ణ, విలన్ల మధ్య పోరాటాలు హైలైట్‌గా ఉండనున్నాయి. అఖండ' సినిమా విజయానికి తమన్ అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం ప్రధాన కారణం. ఈ సీక్వెల్‌లో కూడా అదే మ్యాజిక్‌ను తమన్ రిపీట్ చేయబోతున్నారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.