Trending News

Akira AI Love Story: అకీరా ఏఐ లవ్ స్టోరీ..ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు

Update: 2026-01-27 12:38 GMT

Akira AI Love Story: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా సంచలన తీర్పునిచ్చింది.AI, డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి అకీరా నందన్ అనుమతి లేకుండా రూపొందించిన AI లవ్ స్టోరీ" అనే వీడియో/సినిమాను ప్రసారం చేయకూడదని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఒక వ్యక్తి పేరు, ముఖం, వాయిస్‌ని డీప్‌ఫేక్ ద్వారా ఉపయోగించడం దోపిడీతో సమానమని జస్టిస్ తుషార్ రావు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది ఒక వ్యక్తి గోప్యతా హక్కులను (Privacy Rights) తీవ్రంగా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), యూట్యూబ్, గూగుల్, ఎక్స్ (ట్విట్టర్) వంటి సంస్థలకు కోర్టు నోటీసులు పంపింది. అకీరా పేరుతో ఉన్న నకిలీ ఖాతాలను, వివాదాస్పద వీడియోలను వెంటనే తొలగించాలని ఆదేశించింది.ఈ నకిలీ పేజీలను నిర్వహిస్తున్న వారి IP అడ్రస్ వివరాలను కోర్టుకు సమర్పించాలని టెక్ దిగ్గజాలను ఆదేశించింది.

ఇటీవల అకీరా నందన్ ప్రతిష్టకు భంగం కలిగించేలా సుమారు 56 నిమిషాల నిడివి గల ఒక డీప్‌ఫేక్ వీడియో (సినిమా తరహాలో) యూట్యూబ్‌లో వైరల్ అయ్యింది. దీనిపై అకీరా తరఫున సీనియర్ న్యాయవాది సాయి దీపక్ కోర్టులో వాదనలు వినిపించారు. కాకినాడ పోలీసులు ఇప్పటికే ఈ కేసులో నిందితుడిని (హైదరాబాద్‌కు చెందిన ఒక డాక్టర్) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ తీర్పుతో డిజిటల్ రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులకు రక్షణ లభించినట్లయింది.

Tags:    

Similar News