Anand: అన్నా అంటూనే.. అన్న గురించి ఆనంద్ ఎమోషనల్
అన్న గురించి ఆనంద్ ఎమోషనల్;
Anand: విజయ్ దేవరకొండ న్యూ మూవీ కింగ్డమ్ నుంచి ఇటీవల రిలీజ్ అయిన అన్నా అంటూనే సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అన్నదమ్ముల అనుభందం గురించి చెప్పే ఈ పాట ప్రతి ఒక్క అన్నదమ్ములను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ గా ఆనంద్ దేవర కొండ తన ఇన్ స్టాలో తన అన్నయ్య విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాలోని అన్నా అంటూనే సాంగ్ తో భావోద్వేగమైన పోస్ట్ చేశారు. నాకెప్పుడు కష్టం వచ్చిన మా అన్నయ్య విజయ్ దేవర కొండ ముందుంటాడరని చెప్పుకొచ్చాడు.
ఆనంద్ దేవరకొండ తన అన్నయ్య విజయ్ దేవరకొండతో చిన్నప్పటి జ్ఞాపకాల ఫోటోలు, వీడియోలను కలిపి అన్నా అంటూనే సాంగ్ తో ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో అన్నదమ్ముల అనుబంధాన్ని చాలా అందంగా చూపించారు. ఈ వీడియోను ఆనంద్ దేవరకొండతో పాటు విజయ్ దేవరకొండ కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు, అభిమానులు వారి బాండింగ్‌ను ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు.
కృష్ణకాంత్ రాసిన అన్నా అంటూనే సాంగ్ కు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. విజయ్ దేవరకొండ, సత్యదేవ్ అన్నదమ్ములుగా నటించిన కింగ్డమ్ సినిమాలో వారి అనుబంధాన్ని చూపించే ఒక ఎమోషనల్ సాంగ్. ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానున్నసంగతి తెలిసిందే.